Salman Khan And Katrina Kaif Interact and dance with fans: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. తొలుత కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. థియేటర్లకు ఆడియెన్స్ తాడికి పెరిగింది. నెమ్మదిగా ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఐదురోజుల్లో రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది.


అభిమానులను ఆశ్చర్యపరిచిన సల్మాన్, కత్రినా


గత కొంత కాలంగా సినిమా స్టార్స్ థియేటర్లుకు వెళ్లి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వడం కామన్ గా మారింది. ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు ‘టైగర్ 3’ మేకర్స్. తాజాగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ కు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వెళ్లారు.  వారిని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు ఈ సినిమాలోని మాస్ సాంగ్ కు ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసి అలరించారు. అనంతరం అభిమానులతో కలిసి ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుమారు గంటకు పైగా ఆ థియేటర్ లో ఉన్నారు. చివరకు అభిమానుల కోరిక మేరకు ‘టైగర్ 3’లోని పాటకు హుషారుగా డ్యాన్స్ చేశారు సల్మాన్, కత్రినా. అభిమాన తారలను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






ఫ్యాన్స్ అభిమానానికి సల్మాన్ హ్యాపీ


ఇక ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా సల్మాన్ సంతోషం వ్యక్తం చేశారు. యాక్షన్ హీరోగా రాణించడం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు. ‘టైగర్-3’ సినిమా సక్సెస్ కావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడం అంత ఈజీ కాదని చెప్పారు. యాక్షన్ మూవీస్ అయినా, కొత్తదనం ఉంటేనే అభిమానులు ఆదరిస్తారని చెప్పారు. తన యాక్షన్ మూవీ సిరీస్ లో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.  


ఇక ‘టైగర్ 3’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు.  బాలీవుడ్ సూపర్‌ స్టార్స్‌ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో ఆకట్టుకున్నారు.  ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించడంతో పాటు ఆయనే కథ అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌ సుమారు రూ. 300 కోట్లతో ఈ భారీ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఏక్తా టైగర్'తో ఈ స్పై యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా వచ్చిన 'టైగర్ జిందా హై'భారీ సక్సెస్ అందుకుంది. తాజాగా దానికి కొనసాగింపుగా ‘టైగర్ 3’ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.   


Read Also: ట్రైల‌ర్ తో రీ సౌండ్ క్రియేట్ చేస్తోన్న`సౌండ్ పార్టీ`- స్టార్టింగ్ To ఎండింగ్ పంచులే పంచులు!