కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు.


ఫన్నీ స్పీచ్ తో ఆకట్టుకున్న సుప్రీమ్ హీరో


ఈ వేడుకలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ నవ్వుల పువ్వులు పూయించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియెన్స్ ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ చెప్తూ ఆకట్టుకున్నాడు. ‘‘ఐ లవ్ యు’’ అని చెప్పిన ఓ అభిమానికి అదిరిపోయే సమాధానం చెప్పాడు. లవ్ అనే వర్డ్ తనకు కలిసి రాలేదన్నాడు. ‘‘వద్దురా అబ్బాయిలూ ఇకపై ఆ పదాన్ని వాడకండి’’ అని చెప్పాడు. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ ను పెళ్లి ఎప్పుడని ఫ్యాన్స్ ఆసక్తిగా అడిగారు. దీనికి కాస్తా గట్టిగానే కౌంటరిచ్చాడు. సాయి ధరమ్‌ తేజ్ మాట్లాడుతూ..”మీరెప్పుడైతే అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడవుద్ది. ఇది మీవల్ల అవుతుందా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ’’నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లి అయింది” అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆయన మాటలకు ఈవెంట్‌లో వేదికపై ఉన్న సినీతారలు, అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు. మరికొంత మంది ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటూ ఆశ్చర్యపోయారు.



'వినరో భాగ్యము విష్ణు కథ' మంచి విజయాన్ని అందుకోవాలి- సాయి ధరమ్ తేజ్


కిరణ్ అబ్బవరం ఇప్పటి తనను చాలా సార్లు ఈవెంట్స్ కు రావాలని కోరాడని చెప్పాడు. అయితే, రకరకాల కారణాలతో రాలేకపోయానన్నాడు. ఇన్నాళ్లకు ఈ ఈవెంట్ కు వచ్చే సమయం దొరికిందన్నాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ట్రైలర్ తన చేతుల మీదుగా లాంచ్ కావడం సంతోషంగా ఉందన్నాడు. ట్రైలర్ చాలా బాగుందని చెప్పాడు. ఈ సినిమా బాగా అంచనాలను పెంచుతుందన్నాడు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు తేజ్ వెల్లడించాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను చూస్తూ  లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఎస్ఆర్‌ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌. ఆ తర్వాత ‘సమ్మతమే‘ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.  త్వరలో  ‘వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 






Read Also: బాలీవుడ్, ఊపిరి పీల్చుకో ‘పఠాన్’ వచ్చాడు - ‘బాహుబలి’, ‘2.0’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు