మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ధమాకా'(Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ వెనుక కారణం అదే. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒకట్రెండు పంచ్ డైలాగ్స్ వినిపించాయి. 'అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళి' అంటూ టీజర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ ను బట్టి ఇదొక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. దానికి కామెడీ జోడించి తెరకెక్కించారు దర్శకుడు త్రినాధరావు. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 23న 'ధమాకా' రిలీజ్ కానుంది. 



ఈ సినిమాలో 'పెళ్లి సందడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.


సినిమా స్టోరీ:


అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు. హీరో క్యారెక్టర్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడి ఉంటుందని.. ఈ క్యారెక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ కంపెనీకి సీఈవోగా కనిపించే రవితేజ.. మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. అయితే కంపెనీ సీఈవో అనుకొని పొరపాటున మిడిల్ క్లాస్ వ్యక్తిని రౌడీలు కిడ్నాప్ చేయడం అనేదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 


కామెడీ స్కిట్స్ కోసం హైపర్ ఆది:


ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదితో రాయించారట. దర్శకుడు త్రినాథరావు, హైపర్ ఆది మంచి స్నేహితులు. ఇదివరకు త్రినాథరావు తన సినిమాలో రైటర్ ప్రసన్న కుమార్ ను బాగా ఇన్వాల్వ్ చేసేవారు. ఇప్పుడు హైపర్ ఆది సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. సినిమాలో కామెడీకి ఎక్కువ చోటుంది. ఆ కామెడీ ఎపిసోడ్స్ ను హైపర్ ఆదితో రాయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్టయిల్ లో స్కిట్స్ కనపడతాయని చెబుతున్నారు. బుల్లితెరపై కమెడియన్స్ అలాంటి స్కిట్స్ చేస్తే ఓకే కానీ.. రవితేజ లాంటి మాస్ హీరోతో అటువంటి కామెడీ స్కిట్స్ ను ఎంతవరకు పండించగలరో చూడాలి.  


Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?