Raveena Tandon: బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి రవీనా టాండన్. ఆమెకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే ఆమె నటిగా రాణిస్తోంది. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె  తన సినిమా కెరీర్ ప్రాంభంలోని ఓ సంఘటనను గురించి చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా 1994 లో తెరకెక్కిన సినిమా ‘మోహ్రా’. ఈ సినిమాలో రవీనా నటించింది. ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటలో చీర కట్టులో రవీనా టాండన్ చేసిన డాన్స్ కు, ఆహభావాలకు యూత్ ఫిదా అయిపోయింది. ఇప్పటికీ ఈ పాట క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను రవీనా గుర్తు చేసుకుంది. దీనిపై రవీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవతున్నాయి. 


హగ్గులు, ముద్దులు ఉండకూడదని చెప్పా: రవీనా టాండన్


రవీనా టాండన్ ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట షూటింగ్ లో ఉన్నప్పుడు పాట కోసం మేకర్స్ కు చాలా షరతులు పెట్టినట్లు చెప్పింది. తన చీర జారదని, అలాగే ఎన్ని స్టెప్పులు వేసినా చీర నలగదని, కదలదని స్ఫష్టంగా చెప్పినట్లు చెప్పింది. అలాగే పాటలో ఎలాంటి ముద్దులు, హగ్గులు ఉండవని చెప్పానని అలాగే ఆ పాటను పూర్తి చేశామని అంది. అయితే ఆ పాటలో టిక్ మార్కులు కంటే క్రాస్ మార్కులే ఎక్కువ అని చెప్పింది. ఇప్పటికీ ఆ పాటను ప్రజల నోటి నుంచి వింటుంటే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది రవీనా.


అక్షయ్ కుమార్, నేను ఇప్పటికీ స్నేహితులం: రవీనా


రవీనా 1990 ల చివరలో హీరో అక్షయ్ కుమార్ తో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. 1994 లో వచ్చిన ‘మోహ్రా’ సినిమా తర్వాత వీరిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. పెళ్లికి కూడా సిద్దమయ్యారు, ఎంగేజ్మెంట్ కు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తర్వాత కొన్ని కారణాల వలన  నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని విడిపోయారు. తర్వాత రవీనా అనిల్ తడానీను వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజుల క్రితం ముంబై లో ఓ ప్రయివేటు ఈవెంట్ లో వారిద్దరూ కలసుకున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకొని క్లోజ్ గా మాట్లాడుకోవడంతో వారి రిలేషన్షిప్ పై వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై రవీనా స్పందిస్తూ ఇప్పటికీ తమ మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది రవీనా. అది అలాగే కొనసాగిస్తున్నామని తెలిపింది. అక్షయ్ కుమార్ మంచి నటుడు అని, అతన్ని తాను గొప్పగా చూస్తానని అంది. తమ సినిమా పరిశ్రమలో అక్షయ్ ఒక బలమైన నటుడని తాను ఎప్పుడూ భావిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రవీనా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది రవీనా టాండన్.


Read Also: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్