Ram Gopal Varma break silence : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. ఒకప్పుడు సినిమాలతో సన్షేషన్ క్రియేట్ చేసిన వర్మ..ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులతో ట్రెండింగ్ లో ఉంటున్నారు. అయితే RGV సినిమాలు, ఆయన పెట్టే పోస్టులు మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిగత జీవితంలో వ్యవహారాలు కూడా వైరల్ అవుతుంటాయ్. అప్పట్లో రంగీలాలో హీరోయిన్ గా నటించిన ఊర్మిళ మటోండ్కర్ తో అఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. ప్రతి విషయాన్ని సూటిగా మాట్లాడే వర్మ..ఈ విషయంపై గతంలోనూ పెద్దగా స్పందించలేదు..కానీ రీసెంట్ గా దీనిపై మాట్లాడారు ఊర్మిళ - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో చాలా సినిమాలొచ్చాయ్. ఆ సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయ్. వరుసగా ఒకే హీరోయిన్ కి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తుండడంతో ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అనే ప్రచారం జరిగింది. రీసెంట్ గా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఆ కామెంట్స్ పై రియాక్టయ్యారు వర్మ. ఏమన్నారంటే...
"ఆమె చాలా ప్రతిభావంతులైన నటి అని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఆమెతో చాలా సినిమాల్లో పనిచేశాను. నేను అమితాబ్ బచ్చన్‌తో కూడా ఎక్కువ సినిమాలు చేశాను కానీ దానిగురించి ఎవరూ మాట్లాడరు" ....అని తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన సినిమాలు ఊర్మిళకు వర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు సంపాదించిపెట్టాయ్. తన ఆత్మకథ Guns & Thighs: The Story of My Lifeలో కూడా ఊర్మిళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు RGV. ఆమె అందం, ప్రతిభ నచ్చి రంగీలా మూవీకోసం సెలెక్ట్ చేశానని చెప్పారు. 1995లో వచ్చిన ఆ మూవీ రీసెంట్ గా 4K రీ రిలీజ్ అయింది. 1997 లో దౌడ్ మూవీ, 1998 లో సత్య, 2001లో ప్యార్ తునే క్యా కియా లో నటించింది. ఆ తర్వాత భూత్, కౌన్ మూవీస్ లోనూ RGV తో కలసి పనిచేసింది.
ఊర్మిళతో ప్రేమ వ్యవహారం కారణంగానే RGV భార్య రత్నావర్మ మధ్య దూరం పెరిగిందనే వార్తలొచ్చాయి. ఓ మూవీ షూటింగ్ టైమ్ లో RGV భార్య - ఊర్మిళ మధ్య పెద్ద తగాదా జరిగిందనే వార్తలు కూడా వచ్చాయ్. ఇందుకే రత్నా వర్మ విడాకులు తీసుకున్నారని చెబుతారు. ఆ తర్వాత RGV తన పుస్తకంలో ఊర్మిళను పొగుడుతూ రాయడంతో ఈ వార్తలకు మరింత చేకూర్చినట్టైంది. అయితే ఈ రూమర్స్ వల్లనే ఆ తర్వాత ఊర్మిళకు అవకాశాలు తగ్గిపోయాయని..సపోర్టింగ్ రోల్స్ మాత్రమే పలకరించాయని టాక్. 2016లో కశ్మీర్ బిజినెస్ మ్యాన్ మొహ్సిన్ అక్తర్ మీర్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తన రీఎంట్రీ గురించి ఏడాది క్రితం మాట్లాడుతూ.. RGV తో మళ్లీ కలసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది ఊర్మిళ.
అయితే..రీసెంట్ గా జూమ్ టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై మొదటిసారిగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఆమె వర్సటైల్ యాక్ట్రెస్ అందుకే నాలుగు సినిమాలు చేశాను. అమితాబ్ తో అంతకన్నా ఎక్కువ సినిమాలు చేసినప్పుడు ప్రశ్నించని వారు ఊర్మిళ గురించి ఎందుకు అడుగుతున్నారు..ఇందతా సోషల్ మీడియా, సిస్టమ్ వచ్చిన మిథ్ అంతే అని కొట్టిపడేశారు. అయినా నటీనటుల పనిపై ఫోకస్ చేయాలని పర్సనల్ లైఫ్ కాదన్నారు. ఇప్పటివరకూ డైరెక్టర్ గా , నిర్మాతగా ఉన్న ఆర్జీవీ షో మ్యాన్ అనే మూవీతో తనలో నటుడిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు