మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో కలసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటి వరకూ ‘ఆర్ సి 15’ పేరుతో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే మూవీ టైటిల్ కు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తారని అనుకున్నారంతా. అందరూ అనుకున్నట్టుగానే నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ 15 వ సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ రివీల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీతో ఆయనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. దీంతో శంకర్-చెర్రీ సనిమాకు ముందు అనుకున్న పేర్లు కాకుండా గ్లోబల్ స్థాయిలో ఉండాలని ఈ ‘గేమ్ చేంజర్’ పేరును ఫిక్స్ చేశారని సమాచారం. ముందు ఈ సినిమాకు ‘సీఈవో’, ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను అనుకున్నారట. ‘అధికారి’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారట కానీ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ టైటిల్ తోనే మూవీ లో ఆయన పాత్ర ఎంత బలంగా ఉంటుందో చెప్పకనే చెప్పారు శంకర్. వాస్తవానికి శంకర్ సినిమాల్లో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో చెప్పనసరం లేదు. అలాగే ఆయన సినిమాలు ఆన్నీ ఏదొక మెసేజ్ ను కూడా ఇస్తాయి, ఆలోచించేలా చేస్తాయి. అందుకే ఆయన సినిమాలంటే అంత క్రేజ్. రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయి ఇమేజ్ రావడం అందులోనూ శంకర్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 



ఇక సినిమా టైటిల్ రివీల్ వీడియో విషయానికొస్తే.. ఆ వీడియోను పూర్తిగా గమనిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో మూడు విషయాలు మనం గమనించవచ్చు. అందులో ఒకటి టైటిల్ వీడియోలో ముందు క్యాసినో గేమ్ లా కనిపిస్తుంది. తర్వాత అందులో నుచి అసెంబ్లీ సెటప్ బయటకు వస్తుంది. ఆ అసెంబ్లీ సెటప్ మధ్యలో నుంచి చదరంగంలోని కింగ్ బయటకు వస్తుంది. ఇక తర్వాత ఆ సెటప్ అంతా చదరంగంలోని భటులు మాదిరిగా మారుతోంది. ఈ వీడియో మొత్తం చూస్తుంటే ఆట ఏదైనా అందులో గేమ్ చేంజర్ మాత్రం రామ్ చరణ్ అవుతాడని చెప్పకనే చెప్పారు దర్శకుడు శంకర్. అందుకే ఈ మూవీకు ‘గేమ్ చేంజర్’ అనే పేరు పెట్టారని టాక్. అయితే ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా కనిపించడంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఈ మూవీ ఉంటుందని అనిపిస్తోంది. అయితే సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రతో పాటు ఎన్నికల అధికారి పాత్రలో కూడా రామ్ చరణ్ కనిపించబోతున్నారు అని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఏ పాత్రలో గేమ్ చేంజర్ గా చక్రం తిప్పుతారో చూడాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ లో మూవీ ను నిర్మిస్తున్నారు.


Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?