కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్ గతంతో పోల్చితే మరింత అద్భుతంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లు చక్కటి సమాధానాలతో పెద్ద మొత్తంలో నగదును గెలుచుకుంటున్నారు. జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్న కంటెస్టెంట్ రాహుల్ కుమార్ నేమా ఆట తీరుకు ప్రేక్షకులతో పాటు అమితాబ్ సైతం ఆశ్చర్యపోయారు. వరుస ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, కోటి రూపాలయ ప్రశ్నకు చేరుకున్నారు. అతడి ఆట తీరును బిగ్ బీ ప్రశంసించారు.
కౌన్ బనేగా కరోడ్‌పతి 15 తాజా ఎపిసోడ్‌లో, రోల్ ఓవర్ పోటీదారు రాహుల్ కుమార్ నేమాతో గేమ్ ప్రారంభమవుతుంది. రూ. 6,40,000 ప్రశ్నతో ఆట షురూ అవుతుంది. మహాభారతాన్ని రాజు జనమేజయుడికి ఎవరు చెప్పారు? ఎ. మహర్షి వేద వ్యాస బి. ఋషి వైశంపాయన సి. నారద ముని డి. సంజయ అనే ఆప్షన్స్ ఇస్తారు. ఈ ప్రశ్నకు ప్రేక్షకుల పోల్‌ని ఉపయోగించి B అని సరైన సమాధానం చెప్తారు. ఆ తర్వాత రూ. 12,50,000 ప్రశ్న యునెస్కో 2023 నివేదిక ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల్లో దేనిని నిషేధించాలని సిఫార్సు చేసింది? ఎ. హోంవర్క్ బి. స్కూల్ బ్యాగులు సి. స్మార్ట్ ఫోన్లు డి. జంక్ ఫుడ్ అనే ఆప్షన్స్ ఇస్తారు. డబుల్ డిప్ తో సి అని సమాధానం చెప్పి ఆ అమౌంట్ ను గెలుస్తారు.
నా కాళ్లపై నేను నిలబడాలనుకుంటున్నాను- రాహుల్
ఈ షో ద్వారా గెలుచుకున్న మొత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? అని బిగ్ బీ రాహుల్ ను అడుగుతారు. “నేను ఎప్పుడూ నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఈ మొత్తంతో నేను రోబోటిక్ లెగ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను. లేదంటే ఎవరైనా నాకు తగిన కృత్రిమ కాలును తయారు చేస్తారేమో ప్రయత్నిస్తాను. ఇది విజయవంతమైతే, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది” అన్నారు.
రాహుల్ కు ఎదురైన రూ. కోటి ప్రశ్న ఏంటంటే?
ఆ తర్వాత రాహుల్ రూ. 50 లక్షల ప్రశ్నను ఎదుర్కొంటారు. 2003 FIFA ఉమెన్స్ వరల్డ్ కప్‌ను ఏ కారణం చేత చైనా నుంచిUSAకి మార్చారు? A. 9/11 దాడులు, B. SARS C. స్వైన్ ఫ్లూ D. హాంకాంగ్ నిరసనలు. ఈ ప్రశ్నకు B అనే సరైన సమాధానం చెప్తాడు. ఈ ప్రశ్న తర్వాత నేరుగా రూ. కోటి ప్రశ్నకు చేరుకుంటారు. ఈ మాజీ ముఖ్యమంత్రులలో ఎవరు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు? A. శ్రీ జ్యోతి బసు B. శ్రీ బిజు పట్నాయక్ C. శ్రీ వీరప్ప మొయిలీ D. శ్రీ ఇఎంఎస్ నంబూద్రిపాద్. అతడు రిస్క్ తీసుకోలేక రూ. 50 లక్షలతో గేమ్‌ను విడిచిపెట్టాడు. అయితే, షో నుంచి బయటకు వచ్చే ముందుకు సమాధానం ప్రయత్నించాలని బిగ్ బీ సూచిస్తారు. A అని తప్పు సమాధానం చెప్తాడు. కానీ, కరెక్టర్ ఆన్సర్ C.
రాహుల్ ఆరోగ్య సమస్య ఏంటంటే?
రాహుల్ చిన్నప్పటి నుంచి జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. “నాకు ఆస్టియోజెనిసిస్ అసంపూర్ణంగా ఉంది. ఇది ఎముకలు సులభంగా విరిగియేలా చేస్తుంది. ఇది 20, 000 మందిలో ఒకరికి ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా నాకు దాదాపు 360 సార్లు ఎముకలు విరిగాయి. కాస్త గట్టి బరువు పడితే ఎముక విరిగిపోతుంది. నిద్రలో గట్టిగా ఒరిగిన ఒక్కోసారి ఎముక విరుగుతుంది. ఎముకలు విరగడం, కట్లు వేసుకోవడం కామన్ అయ్యింది. అలవాటు పడిపోయాను” అని చెప్పారు.
Read Also: రజనీ సినిమాలో బిగ్ బీ - 3 దశాబ్దాల తర్వాత మళ్లీ కలుస్తున్న లెజెండరీ యాక్టర్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial