‘RRR’ చిత్రం గురించి భారత్ లో పాటు యావత్ ప్రపంచ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అత్యున్నత సినీ అవార్డు ఆస్కార్ ను అందుకుని భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఎన్నో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. పలు దేశాల్లోనూ సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకుంది.  గోల్డెన్ గ్లోబ్,  క్రిటిక్స్ ఛాయిస్ అవార్టులతో పాటు ‘నాటు నాటు’ పాట ఏకంగా అకాడమీ అవార్డును పొందింది.    


‘RRR’ సినిమా చూడలేదు- ప్రియాంక చోప్రా


ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నన ‘RRR’ సినిమాను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా. ‘RRR’ టీమ్‌కి ఆస్కార్ క్యాంపెయిన్ సమయంలో USలో ఆతిథ్యం ఇచ్చిన ప్రియాంక.. ఆ సినిమాను చూడలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. “నాకు టైమ్ లేదు. నేను సినిమాలు ఎక్కువగా చూడను. టీవీ షోలు చూస్తుంటాను” అని వెల్లడించారు.


వారిలో ఎవరు గొప్ప? అనేది నేను చెప్పలేను- ప్రియాంక చోప్రా  


వాస్తవానికి ‘RRR’ సినిమాను యుఎస్‌ ప్రదర్శించే సమయంలో ప్రియాంక హోస్ట్‌ గా వ్యవహరించారు. దర్శకుడు SS రాజమౌళి,  సంగీత దర్శకుడు MM కీరవాణితో దిగిన ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. “ఈ అపురూపమైన భారతీయ చలనచిత్ర ప్రయాణానికి నేను నావంతు సహకారం అందించగలను. ‘RRR’ సినిమాకు గుడ్ లక్, అభినందనలు” అని క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు,  ప్రియాంక తన బాలీవుడ్ మూవీ ‘జంజీర్‌’లో స్క్రీన్‌ షేర్ చేసుకున్న నటుడు రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో పలు విషయాలు వెల్లడించారు. చరణ్ ను ఇండియన్ బ్రాడ్ పిట్ గా ప్రశంసించారు.  “రామ్‌కు మంచి చరిష్మా ఉంది. నాకు బ్రాడ్ పిట్ తెలియదు. అతడు  మంచివాడో? కాదో? నాకు తెలియదు. కానీ రామ్ మంచివాడు” అని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా,  రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్‌ లో ఎవరు గొప్పవారో చెప్పాలనే ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఇద్దరు నటులలో ఒకరిని ఎంచుకోవడం కష్టం అని చెప్పుకొచ్చారు.  


ఈ సంవత్సరం ఆస్కార్‌కు ముందు, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోని పారామౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో యాన్యువల్ సౌత్ ఏషియన్ ఎక్సలెన్స్ ప్రీ-ఆస్కార్ బాష్‌ను నిర్వహించారు.  ఈ వేడుకకు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రియాంక ఆతిథ్యం ఇచ్చారు. LA లోని ప్రియాంక ఇంట్లో ‘RRR’ స్టార్స్ కొంత సమయాన్ని గడిపారు. ప్రియాంక  తాజాగా ‘సిటాడెల్‘ అనే వెబ్ సిరీస్ లో నటించారు. రస్సో బ్రదర్స్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. 






Read Also: నా తల్లి ఎదుర్కొన్న నరకయాతన మరే తల్లికి రాకూడదు - ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య భావోద్వేగం