Vijay Antony's Vanda Devullu OTT Release Date : బిచ్చగాడుతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా... రీసెంట్‌గా అదే కాంబోలో వచ్చిన సినిమా వంద దేవుళ్లు (Vanda Devullu). తమిళ మూవీ 'నూరు సామి'కి డబ్బింగ్ ఇది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Continues below advertisement

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'వంద దేవుళ్లు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... త్వరలోనే ఓటీటీలోకి రానుంది. జులై చివరి వారంలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో కానీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా... విజయ్ ఆంటోని, శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, శక్తి, కావ్య అనిల్, కరుణాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Continues below advertisement

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ ఆంటోని, రామాంజనేయులు జువ్వాజి నిర్మించారు. థియేటర్లలో అంతంత మాత్రం రెస్పాన్స్ అందుకున్న సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read : Savitri Classics : మహానటి సావిత్రి అద్భుతాలకే అద్భుతం - వారికి మరణం ఉండదన్న బ్రహ్మానందం... సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ బుక్ లాంచ్

స్టోరీ ఏంటంటే?

ఊరిలో ఉండే వాసుకి (శ్వాసిక విజయ్)కి 26 ఏళ్ల వయసులో భర్త మరణిస్తాడు. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో తన  పిల్లలకు అన్నీ తానై చూసుకోవాలని అనుకుంటుంది. సొంత కుటుంబం నుంచి కూడా ఆసరా దక్కదు. మగ దిక్కు లేదనే అలుసుతో సమాజంలో నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతుంటారు. వంకర బుద్ధి ఉన్న మగాళ్ల చూపు ఆమెపై పడుతుంది. అన్నింటినీ దాటుకుని అవమానాలను పంటి బిగువున పెట్టుకుని తన పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.

ఊరి వారి సూటి పోటి మాటలు భరించలేక పెళ్లి చేసుకోడమే దీనికి పరిష్కారం అని భావించి తన పిల్లలకు ఈ విషయం చెబుతుంది. కొడుకు కోప్పడడంతో ఆ విషయం పక్కన పెట్టేస్తుంది. అయితే, చదువు పూర్తై కంపెనీ పెట్టిన తర్వాత ఆమె పెద్ద కొడుకు వాసుకికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఒకప్పుడు పెళ్లంటే కోప్పడిన కొడుకు ఇప్పుడెందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? కొడుకు నిర్ణయానికి వాసుకు ఎలా రియాక్ట్ అయ్యింది? ఏడుకొండలు (విజయ్ ఆంటోని) సంబంధం ఎవరు తెచ్చారు? వందన (కావ్య అనిల్)తో వాసుకి కొడుకు పెళ్లి చూపుల కథ ఏంటి? వాసుకి పెళ్లంటే ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read :Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.