Vana Veera OTT : ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vana Veera OTT Platform : అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'వనవీర'. ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

Avinash Thiruveedhula's Vana Veera OTT Streaming : యంగ్ హీరో అవినాష్ తిరువీధుల ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'వనవీర'. యాక్షన్ అంశాలతో పాటే మైథలాజికల్ టచ్ ఇచ్చిన ఈ మూవీ కొత్త ఏడాది కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'వనవీర' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఎలాంటి హడావుడి లేకుండా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీకి హీరో అవినాష్ తిరువీధులే దర్శకత్వం వహించగా... సిమ్రాన్ చౌదరి, నందు, కోన వెంకట్, పృథ్వీ, ఆమని, శివాజీ రాజా, సత్య, చమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మించగా... వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
Also Read : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్ పేర్లు ఇవే - మెగాస్టార్ పేరు కలిసి వచ్చేలా వారసుడి నేమ్... అర్థం ఏంటో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
వనపురంలో మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన యువకుడు రఘు (అవినాష్) ఐఐటీ పూర్తి చేసినా ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటాడు. తన తండ్రి (శివాజీ రాజా) ప్రేమగా కొనిచ్చిన కొత్త బైక్ అంటే తనకు ప్రాణం. దానిపై మరొకరి చేయి పడితేనే సహించలేడు. అలాంటిది ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో తన బైక్‌ను దేవా (నందు) అనే లోకల్ పొలిటికల్ లీడర్ ర్యాలీ కోసం ఆయన మనుషులకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, అలా ఇచ్చిన బైక్ మళ్లీ తిరిగి రాకపోవడంతో దాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు దేవా ఇంటికి వెళ్తాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దేవా బైక్‌ను రఘుకు ఇచ్చాడా? ఎమ్మెల్యే కావాలనుకున్న దేవా లక్ష్యానికి రఘు ఎలా అడ్డుపడ్డాడు? అసలు వనపురంలో ఉన్న కథకు రామాయణంలో కిష్కింధకాండకు ఉన్న కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
























