అన్వేషించండి

Vaazha 2 OTT : వాలా, వాలా 2 ఎందుకు చూడాలి? - కోట్లు కలెక్ట్ చేసే కథేంటి!... టాప్ 5 రీజన్స్ ఇవే!

Vaazha 2 OTT Platform : వాలా 2 జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు వాలా, వాలా 2ల్లో ఏముంది. ఎందుకు అంతగా యూత్‌తో పాటు అందరినీ అట్రాక్ట్ చేసింది ఓసారి చూస్తే...

Top 5 Reasons To Must Watch Vaazha 2 Movie : మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 2024లో వచ్చిన 'వాలా - బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ రెండు పార్టులకు విపిన్ దాస్ స్టోరీ అందించగా... ఆనంద్ మీనన్ ఫస్ట్ పార్ట్‌కు దర్శకత్వం వహించారు. సీక్వెల్‌ను సవిన్ డైరెక్ట్ చేశారు. 

ఎందుకు చూడాలి... టాప్ 5 రీజన్స్

కేవలం రూ.5 కోట్లతో సినిమా తీస్తే 'వాలా 2' రూ.200 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది? అసలెందుకు ఈ సినిమా మిస్ కాకుండా చూడాలి? అంతగా అట్రాక్ట్ చేసిన ఈ ఫ్రాంచైజీ స్టోరీ ఏంటి? టాప్ 5 రీజన్స్ ఓసారి చూస్తే...

లైఫ్ అంటే చదువేనా - లైఫ్‌ అంటే మంచిగా చదువుకుని బాగా సెటిల్ అవ్వడం మాత్రమే కాదు. తాము సాధించలేనివి తమ పిల్లలతో సాధించుకోవాలనుకునే పేరెంట్స్... వాటిని ప్రెషర్‌లా ఫీలయ్యే పిల్లలు. అదే పిల్లలకు ఏదైనా బాధ కలిగినా, ఓ వయసు వచ్చాక సెటిల్ కాకపోయినా అండగా నిలిచే అమ్మ, నాన్నలు ఇలా ప్రతీ ఇంట్లో జరిగే ఓ మధ్య తరగతి మనుషుల మధ్య కథే వాలా 2.

మనల్ని చూసుకుంటాం - ఈ మూవీలో చిన్నప్పటి సీన్స్ మనల్ని మనకు గుర్తు చేస్తాయి. స్కూలుకు వెళ్లాలంటే భయం, అక్కడ మనకు బెస్ట్ ఫ్రెండ్ అనిపించే చెడ్డీ దోస్తులు వారితో షేర్ చేసుకునే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పిప్పర్మెంట్ బిల్లలు, టీచర్‌కు తెలీకుండా చాటుగా తినే అలవాట్లు, అన్నీ మనల్నీ చైల్డ్ హుడ్ డేస్‌కు తీసుకెళ్తాయి.

Also Read : 'సతీ లీలావతి' రివ్యూ: భర్తను కట్టేసి కొట్టేసిన భార్య... మెగా కోడలు లావణ్య సినిమా హిట్టా? ఫట్టా?

ఫస్ట్ లవ్... మర్చిపోగలమా? - జీవితంలో స్కూల్‌ డేస్‌లో ప్రతీ అబ్బాయికి ఫస్ట్ క్రష్ ఉంటుంది. ఆ ఏజ్‌లో అది ప్రేమ అనే భావన ఊహకు తెలియకపోయినా ఆ అమ్మాయి కోసం బట్టలు చించుకుంటాం. ఆ అమ్మాయి స్కూలుకు వస్తే ఆమెనే చూస్తూ కూర్చుంటాం. అందరిలోనూ మనకు ఆమె చాలా స్పెషల్. సరిగ్గా అదే అమ్మాయిని మన దోస్త్ గాడూ చూస్తాడు. ఇక మొదలవుతుంది ఇద్దరి మధ్య గలాటా. పిల్లను ఇంప్రెస్ చేసేందుకు పోటీ మామూలుగా ఉండదు. చిన్నప్పటి ఆ బెస్ట్ మూమెంటే ఈ కథ.

టాపర్ వర్సెస్ మనం - మనం చదువులో టాపర్ అయితే నో ప్రాబ్లమ్. కానీ మనం యావరేజ్ స్టూడెంట్స్ అయితే టాపర్‌తోనే అసలు సమస్య. పేరెంట్స్ కంపేరిజన్స్, టీచర్స్ దొబ్బులు... టైం దొరికితే టీచర్ వద్ద వాడ్ని ఇరికించేందుకు స్కెచ్చులు... ఇవి మీ లైఫ్‌లోనూ జరిగే ఉంటాయి. వాటిని గుర్తు చేసుకునేందుకైనా ఈ మూవీ చూడాల్సిందే.

Also Read : రామ్ చరణ్ పెద్ది తుపాను షురూ - బాబాయ్ పవన్ రికార్డు బ్రేక్ చేసిన అబ్బాయ్... అతి తక్కువ టైంలోనే...

స్కూల్ To కాలేజ్ - స్కూల్‌లో జిగిరి దోస్తులు కాలేజీలోనూ కలిసి చేరితే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇక కాలేజ్ లవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లెక్చరర్స్‌తో గొడవలు, బస్టాప్ వద్ద పంచాయతీలు, ఎగ్జామ్ హాల్‌లో తెల్ల ముఖాలు, బ్యాక్ లాగ్స్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయాలనే పట్టుదల. ఇవన్నీ మనం ఈ కథలో చూడొచ్చు.

ఎమోషనల్... కన్నీళ్లు ఆగవు - కొడుకు బాగా సెటిలై విదేశాల్లో డాలర్స్ సంపాదిస్తున్నాడని ఆనందపడాలా?, దూరమయ్యాడని బాధ పడాలా? ఎటూ తేల్చుకోలేని స్టేజ్. అవసాన దశలో ఉన్న పేరెంట్స్‌ను చూసేందుకు కూడా టైం దొరకని స్థితి. ఇది ప్రస్తుతం ప్రతీ ఒక్కరినీ ప్రతిబింబిస్తుంది. వాలా, వాలా 2 మూవీస్‌ల్లో క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తే ఎమోషనల్‌గా గుండెలు బరువెక్కుతాయి. కన్నీళ్లు ఆగవు. ప్రస్తుతం వాలా, వాలా 2 రెండు మూవీస్ కూడా జియో హాట్ స్టార్‌ తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఆ సినిమాలు చూసేయండి. 

Also Read : 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ - తెలుగు వెర్షన్‌పై బిగ్ ట్విస్ట్... ఎన్ని భాషల్లో చూడొచ్చంటే?
Save The Tigers 3: అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!
అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!
Dhairye Sahase Amrutha OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Samantha: సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Embed widget