This Week Theatrical Releases : థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే మూవీస్ - ఓటీటీల్లో సైకలాజికల్, యాక్షన్ థ్రిల్లర్స్
Upcoming Telugu Movies : ఈ వారం చిన్న సినిమాల దగ్గర నుంచి కాంట్రవర్సీ మూవీ సీక్వెల్ వరకూ థియేటర్లలో సందడి చేయనున్నాయి. యంగ్ హీరో శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ సైతం రానుంది.

Upcoming Theatrical OTT Releases In February Last Week : ఈ వారం సీక్వెల్ మూవీస్‌తో పాటు కామెడీ ఎంటర్టైనర్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చిన్న సినిమా నుంచి యంగ్ హీరో శ్రీవిష్ణు మూవీస్ వరకూ థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ యాక్షన్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం'
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తుండగా... సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఎమోషనల్ 'ది రైజ్ ఆఫ్ అశోక'
సతీశ్ నీనసాం, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త మూవీ 'ది రైజ్ ఆఫ్ అశోక'. టాలీవుడ్ ఆడియన్స్ కోరుకునే ఎమోషనల్ కథాంశంతో మూవీ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. వినోద్ వి దుండలే దర్శకత్వం వహించగా... వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నిర్మించారు. ఈ నెల 27న సినిమా థియేటర్లలోకి రానుంది.
కాంట్రవర్సీ 'ది కేరళ స్టోరీ 2'
వివాదాలతో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ 'ది కేరళ స్టోరీ'. దీనికి సీక్వెల్ 'ది కేరళ స్టోరీ 2' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా... విపుల్ అమృత్‌లాలా షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా నిర్మించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌పై విమర్శలు రాగా... మరి మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
Also Read : ఉదయపూర్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక - వెడ్డింగ్ ఆఫ్ విరోష్ సెలబ్రేషన్స్... వీడియో వైరల్
ఫాదర్ సెంటిమెంట్‌తో 'సన్ ఆఫ్'
సాయి సింహాద్రి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ మూవీ 'సన్ ఆఫ్'. బత్తుల సతీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో మూవీస్/ వెబ్ సిరీస్ లిస్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియో - ది బ్లఫ్ (హాలీవుడ్ మూవీ - ఫిబ్రవరి 25), ఇక్కీస్ (హిందీ మూవీ - ఫిబ్రవరి 26), బ్రిడ్డర్టన్ (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27), ది సీఈవో క్లబ్ (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 23), ది గ్రే హౌస్ (హిస్టారికల్ డ్రామా - ఫిబ్రవరి 26), హనీ (ఫిబ్రవరి 27)
- నెట్ ఫ్లిక్స్ - అక్యూజ్డ్ (హిందీ మూవీ - ఫిబ్రవరి 27), చథా పచ్చ
- జియో హాట్ స్టార్ - ఏ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ ఫైనల్ (ఫిబ్రవరి 23), ప్యారడైజ్ సీజన్ 2 (వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 23), వన్ బ్యాటిక్ ఆఫ్టర్ అనదర్ (యాక్షన్ థ్రిల్లర్ - ఫిబ్రవరి 26), సీక్రెట్ స్టోరీస్ (ఫిబ్రవరి 27), సంగ్ మర్మర్ (హిందీ సిరీస్ - ఫిబ్రవరి 26), రోస్లిన్ (తెలుగు సిరీస్ - ఫిబ్రవరి 27), బుగోనియా (ఫిబ్రవరి 28).
- జీ5 - క్రాంతి జ్యోతి విద్యాలయ్ (ఫిబ్రవరి 27), రాక్షస, కెన్నడీ, డాటర్ ఆఫ్ ప్రసాదరావు (తెలుగు సిరీస్ - ఫిబ్రవరి 27), అంధా ప్యార్ (రియాలిటీ షో - ఫిబ్రవరి 28), తడయమ్ (తమిళ సిరీస్ - ఫిబ్రవరి 27)
- ఈటీవీ విన్ - శ్రీ చిదంబరం గారు (తెలుగు మూవీ - ఫిబ్రవరి 26).
























