This Week Release Movies In Telugu: ఈ వారం పలు చిన్న బడ్జెట్ సినిమాలో థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ చాలా సినిమాలు సందడి చేయబోతున్నాయి. పలు వెబ్ సిరీస్ లు కూడా ఆకట్టుకోనున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ముందుగా చూద్దాం.


ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:


1. సుందరం మాస్టర్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 23


కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సుందరం మాస్టర్’. మాస్ మహారాజ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి దివ్య శ్రీపాద ఫిమేల్ లీడ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన  ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రాన్ని ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై ర‌వితేజ‌, సుధీర్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల  సంగీతం సమకూర్చగా, దీపక్ ఎంటాల సినిమాటోగ్రఫీ నిర్వహించారు.


2. భ్రమయుగం (మలయాళ చిత్రం – తెలుగు డబ్) – ఫిబ్రవరి 23


మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భ్రమయుగం’. పాన్‌ ఇండియాగా డార్క్‌ ఫాంటసి హారర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను భూత‌కాలం ఫేమ్ రాహుల్‌ సదాశివన్ పాన్‌ ఇండియాగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  మార్చి 23న ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తోంది.


3. మస్తు షేడ్స్ ఉన్నయ్ రా (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 23


విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అభినవ్‌ ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రంలో తొలిసారి హీరోగా చేశాడు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ పై భవాని కాసుల, ఆరెం రెడ్డి, ప్రశాంత్‌  నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.  అభినవ్‌ గోమఠం, వైశాలి రాజ్‌ జంటగా తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.


4. ముఖ్య గమనిక (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 23


విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఈ సినిమాకు వేణు మురళీధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివిన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినూత్న కథాంశంతో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.


5. సిద్ధార్థ్ రాయ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 23


‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ చిత్రానికి యశస్వి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆనంద్, కల్యాణి నటరాజ్, మాథ్యూ వర్గీస్, నందినీ, కీర్తన కీలకపాత్రలు చేశారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహిన్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జయ అడపాక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


6. సైరన్ (తమిళ చిత్రం – తెలుగు డబ్) – ఫిబ్రవరి 23


7. క్రాక్ (హిందీ చిత్రం) - ఫిబ్రవరి 23


8. ఆర్టికల్ 370 (హిందీ సినిమా) – ఫిబ్రవరి 23


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు:


ప్రైమ్ వీడియో


1. పోచర్ (మలయాళ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 23


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్


1. మలైకోట్టై వాలిబన్ (మలయాళ చిత్రం)– ఫిబ్రవరి 23


నెట్‌ఫ్లిక్స్


1. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్) – ఫిబ్రవరి 23


ETV విన్


1. శీష్ హల్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 22


లయన్స్‌ గేట్ ప్లే


1. సా ఎక్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 23


Read Also: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి