Nithiin's Thammudu OTT Partner Locked: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అవెయిటెడ్ మూవీ 'తమ్ముడు'. జులై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఓటీటీ డీల్‌పైనా తాజాగా క్లారిటీ వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను సదరు ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ ఓటీటీలోకి..

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు మూవీ రిలీజ్ వాయిదా పడగా.. ఇటీవలే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ప్రమోషనల్ వీడియోస్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ఈ మూవీకి 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. నితిన్ సరసన హీరోయిన్స్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కూడా ఈ మూవీతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. స్వాసిక, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

ట్రైలర్ లోడింగ్

ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర నుంచీ ట్రైలర్ రిలీజ్ డేట్ వరకూ అన్నింటినీ డిఫరెంట్‌గా ఫన్నీ వీడియోస్‌తో అనౌన్స్ చేసింది మూవీ టీం. డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా విడుదల తేదీని విభిన్నంగా అనౌన్స్ చేశారు మేకర్స్. యాక్టర్స్ ఒక్కొక్కరుగా ఆయన వద్దకు వచ్చి రిలీజ్ ఎప్పుడంటూ ప్రశ్నిస్తుండగా.. చివరకు రిలీజ్ డేట్ చెప్పడం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ట్రైలర్ బుధవారం సాయంత్రం రిలీజ్ కానుండగా.. దీనికి సంబంధించి ప్రమోషనల్ వీడియోలో హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ సందడి చేశారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీజర్ కన్నా ముందే ట్రైలర్

ఈ మూవీ టీజర్ కన్నా ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం డిఫరెంట్‌గా ట్రైలర్ వీడియోతోనే ప్రమోషన్స్ ప్రారంభించనుంది మూవీ టీం. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Also Read: బన్నీతో కాదు ఎన్టీఆర్‌తో? - మైథలాజికల్ మూవీపై త్రివిక్రమ్ రూట్ మార్చేస్తున్నారా?

సిస్టర్ సెంటిమెంట్‌తో

ఈ మూవీ అక్క తమ్ముళ్ల సెంటిమెంట్‌తో ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. అక్కకు ఎదురైన ప్రమాదాల నుంచి తమ్ముడు ఎలా బయటపడేశాడు?, ఆమెకు ఎలా అండగా నిలిచాడు?, అక్క కూతురుని ఏ విధంగా కాపాడాడు? అనేదే స్టోరీ అని పోస్టర్స్ బట్టి అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ.. ఈ సినిమాలో నితిన్‌కు అక్క పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నితిన్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'రాబిన్ హుడ్' నిరాశపరచగా.. 'తమ్ముడు'పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో నితిన్ మళ్లీ కమ్ బ్యాక్ కావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.