Teja Sajja To Host Traitors Reality Show : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏకంగా ఫేమస్ రియాలిటీ షోకే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది.

Continues below advertisement

అసలేంటీ షో?

బాలీవుడ్‌లో బిగ్ సక్సెస్ అయిన 'ది ట్రైటర్స్' అనే రియాలిటీ షో ఇప్పుడు తెలుగులోనూ రానుంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఇది స్ట్రీమింగ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన షో ది ట్రైటర్స్. హిందీ రియాలిటీ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. తెలుగు షోకు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ షోలో కేవలం ఇంటెలిజెన్స్ బేస్డ్‌గా నడుస్తుంది. టాలెంట్‌తో పాటు ఇంటెలిజెన్స్ ఉన్న వారు మాత్రమే సక్సెస్ అవుతారు. మొత్తం 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. 

Continues below advertisement

రీసెంట్‌గా జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో తెలుగు షోను అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. బాలీవుడ్ హోస్ట్ కరణ్ జోహర్‌తో తేజ సజ్జా సందడి చేశారు. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ రియాలిటీ షో జరగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా... జాంబిరెడ్డి, హనుమాన్ మూవీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. లాస్ట్ ఇయర్ మిరాయ్ మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జాంబిరెడ్డి సీక్వెల్ నుంచి జై హనుమాన్ (హనుమాన్ సీక్వెల్), మిరాయ్ సీక్వెల్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం జై హనుమాన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న తేజ సజ్జా... ఇప్పుడు ఫేమస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ కావడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ కానుంది.