Sundeep Kishan's Super Subbu OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఫస్ట్ ఓటీటీ డెబ్యూ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. వెరైటీగా స్పెషల్ వీడియోతో డేట్ అనౌన్స్ చేశారు.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు' జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్ ఫ్లిక్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. 'ఓ అమాయక యువకుడు... ట్రెడిషనల్  విలేజ్... అసాధ్యమైన ఓ ఉద్యోగం. కెమిస్ట్రీ రాని వాడు ఒక ఊరికి కెమిస్ట్రీ నేర్పిస్తే ఎలా ఉంటుంది?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

Continues below advertisement

ఇప్పటికే రిలీజ్ చేసిన సిరీస్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజా వీడియో ఆ హైప్ మరింత పెరిగింది. సుబ్బు (సందీప్ కిషన్)ను చంపేందుకు గ్రామస్థులు అతని వెంటపడగా... అతడు పారిపోతున్న దృశ్యాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.

Also Read : This Week OTT Releases : దృశ్యం 3 To కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్ - ఈ వారం ఒక్క రోజే 8 మూవీస్ స్ట్రీమింగ్

ఈ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా... సందీప్ కిషన్‌తో పాటు మిథిలా పాల్కర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, గెటప్ శ్రీను, సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఫ్యామిలీ ప్లానింగ్‌పై అవగాహన కల్పించడం కోసం ఓ గ్రామానికి వెళ్లిన హీరో అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఎలాంటి పాట్లు పడ్డాడు? అవగాహన లేని గ్రామస్థుల నుంచి తనను చంపాలనుకునే వారి నుంచి హీరో తనను తాను ఎలా రక్షించుకున్నాడు అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read : Romantic Thriller OTT : మూడు ఓటీటీల్లో రొమాంటిక్ సైకో థ్రిల్లర్ - డిజిటల్‌లో సూపర్ ట్రెండింగ్... ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.