Shriyam Bhagnani's Sumo Didi OTT Platform Locked : స్పోర్ట్స్ డ్రామా మూవీస్, వెబ్ సిరీస్‌లు సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మరో సరికొత్త స్పోర్ట్స్ రిలేటెడ్ స్టోరీ నేరుగా ఓటీటీలోకి రానుంది. అయితే, ఇది ఓ మహిళా రెజ్లర్ బయోపిక్. ఇంతకూ ఏంటా మూవీ... ఎవరిది ఆ బయోపిక్ అనేది ఓసారి చూస్తే...

Continues below advertisement

ఇండియాస్ ఫస్ట్ సుమో రెజ్లర్

ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ (భారీ శరీర బరువు గల మల్ల యోధుడు/మల్ల యోధురాలు) ఆధారంగా ఈ బయోపిక్ రూపొందించారు. అదే 'సుమో దీదీ' (Sumo Didi). భారత మహిళా సుమో రెజ్లర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హేతల్ దవే. ఆమె రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. ప్రముఖ ఓటీటీ 'జీ5' (Zee5)లో ఈ సినిమా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుంది. 'అంచనాల భారం. వాటిని అధిగమించే శక్తి. ఒక అసాధారణమైన నిజ కథకు సాక్ష్యమివ్వండి' అంటూ తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Continues below advertisement

'నువ్వు బరువు తగ్గకుంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?' అంటూ హేతల్ దవేను కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో ప్రారంభమైన టీజర్ ... రెజ్లింగ్ కోసం ఆమె ఎంత కష్టపడింది? సుమో రెజ్లర్‌గా ఎలా మారింది? అనే అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇప్పటికే టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 'సుమో దీదీ'ని ప్రదర్శించారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. 

Also Read : Chennai Love Story Collections : చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!

ఈ మూవీకి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించగా... మహిళా రెజ్లర్ హేతల్ దవే పాత్రలో శ్రియం భగ్నానీ నటించారు. చైతన్య శర్మ, నితీష్ పాండే, రాఘవ్ ధీర్, అనుభా ఫతేపురియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ముంబైకి చెందిన ఓ సాధారణ మధ్య తరగతి అమ్మాయి, సమాజంలో మూస పద్ధతులను, అవమానాలు, బాడీ షేమింగ్ ఎదుర్కొని జపాన్ వెళ్లి సుమో రెజ్లర్‌గా కఠినమైన ట్రైనింగ్ తీసుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో దేశానికి ఎలా పేరు తీసుకొచ్చారు? అనేదే ఈ మూవీ స్టోరీ. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Also Read : Secret Of kalinga OTT : బావిలో యువరాణి ఆత్మ నిద్ర లేస్తే? - ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్... డోంట్ మిస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.