Sshh Romantic Series OTT Release Date Locked : బోల్డ్, రొమాంటిక్ వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌తో అలరించిన క్రేజీ వెబ్ సిరీస్ 'ష్...'. ఫస్ట్ రెండు సీజన్స్ సూపర్ రెస్పాన్స్ అందుకోగా... రీసెంట్‌గానే థర్డ్ సీజన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ష్... వెబ్ సిరీస్ సీజన్ 3  ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ప్రతీ పాత్రకు ఓ కథ ఉంటుంది. సీజన్ 3 తారాగణాన్ని కలవండి' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ అంథాలజీ సిరీస్‌లో కొత్త వారు నటించనున్నారు. గత రెండు సీజన్ల కంటే మరింత బోల్డ్ సీన్స్‌తో ఆకట్టుకోనున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే తెలుస్తోంది.

Continues below advertisement

రొమాంటిక్ లైఫ్, సెక్స్ ఎడ్యుకేషన్

తమిళంలో ఫస్ట్ రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సిరీస్‌ను తెలుగులో స్ట్రీమ్ చేశారు. వేర్వేరు నేపథ్యం ఉన్న అమ్మాయిల లైఫ్ స్టోరీ, పాంటసీలు, కలలు, రొమాంటిక్ లైఫ్‌ను చూపించారు. ఫస్ట్ సీజన్‌లో శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్యా దత్తా, క్రిష కురుప్, మైమ్ గోపీ తదితరులు నటించారు.

నాలుగు ఎపిసోడ్స్‌లో వేర్వేరు అమ్మాయిల కథలను చూపించారు. సెక్స్ ఎడ్యుకేషన్, మళ్లీ కలుద్దాం, ఒక్కడు, రీలోడ్ అనే ఎపిసోడ్స్ రూపొందించారు. స్కూల్ ఏజ్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌తో పాటు ఇద్దరు మాజీ లవర్స్ మళ్లీ కలిస్తే ఏం జరుగుతుంది?, మిడిల్ ఏజ్ రొమాన్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఓ యువకుడు అమ్మాయికి అట్రాక్ట్ అయి ఏం చేశాడు? అనే అంశాలను నాలుగు ఎపిసోడ్స్‌లో చూపించారు.

Also Read : Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి

కాల్ బాయ్ To లీక్డ్ వీడియో

ఇక సెకండ్ సీజన్ విషయానికొస్తే... ఫస్ట్ పార్ట్ కంటే మరింత బోల్డ్‌గా రూపొందించారు. ఇందులోనూ 4 ఎపిసోడ్స్ ఉండగా... వెట్రి, ప్రేమ్ జీ, వేదిక, జినాల్ జోషి, ఐశ్వర్య దత్తా, అరోరా, మానుషి, సాయి చరణ్, ఉమ, సుభాష్ సెల్వం, విలియం పాట్రిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

గిగోలో - అప్పుల్లో కూరుకున్న ఓ యువకుడు తన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కాల్ బాయ్‌గా మారతాడు. ఓ వివాహిత అతని జీవితంలోకి వస్తే ఏం జరిగింది అనేదే గిగోలో.

దబిడి దిబిడి - కుటుంబ ఆంక్షలు ధిక్కరించే అమ్మాయి ఓ ఫుట్ బాల్ ఆటగాడితో లవ్ స్టోరీ నడుపుతుంది. ఓ రోజు రాత్రి ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయనేదే కథ.

లీక్డ్ వీడియో - ప్రశాంతంగా సాగిపోతున్న ఓ అమ్మాయి జీవితం ఓ ప్రైవేట్ వీడియోతో తలకిందులవుతుంది. దీంతో సమాజంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆమె ఎలా నిలబడింది అనేదే కథ.

తొలి స్వప్నం - ఓ కాలేజీ కుర్రాడు ఒంటరితనంతో అశ్లీల చిత్రాలకు బానిసగా మారతాడు. ఇదే టైంలో జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన ఓ మహిళ అతని జీవితంలో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే కథ. ఇప్పుడు మూడో సీజన్‌లో సరికొత్త కంటెంట్‌తో ఫస్ట్ రెండు సీజన్లను మించి రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Ugly Story OTT : అగ్లీ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ - 15 రోజుల్లోపే ఓటీటీలోకి నందు, అవికా గోర్ రొమాంటిక్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.