Sri Chidambaram Garu OTT : ఓటీటీలోకి 'శ్రీ చిదంబరం గారు' - 20 రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Sri Chidambaram Garu OTT Platform : రీసెంట్‌గా రిలీజైన 'శ్రీ చిదంబరం గారు' 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు.

Vamsi Tummala's Sri Chidambaram Garu OTT Release Date Locked : యంగ్ హీరో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రూరర్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'శ్రీ చిదంబరం గారు'. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 20 రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'శ్రీ చిదంబరం గారు' మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఈ నెల 19 నుంచి అందుబాటులోకి రానుంది. 'హృదయాలను కదిలించిన బ్లాక్ బస్టర్ సెన్సేషన్‌గా మారిన స్టోరీ.' అంటూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఈ మూవీకి వినయ్ రత్నం (విన్ను) దర్శకత్వం వహించగా... వంశీ, సంధ్యలతో పాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, అరుణ్ కుమార్, కల్పలత, తులసి నాయుడు, శంకర్రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'క' వంటి హిట్ మూవీస్ తీసిన నిర్మాణ సంస్థ 'శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్‌పై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు.
View this post on Instagram
Also Read : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్ పేర్లు ఇవే - మనవడు, మనవరాలితో మెగా ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్
స్టోరీ ఏంటంటే?
సోలమన్ (వంశీ తుమ్మల) చిన్నప్పటి నుంచే ఓ రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఉంటూ ఎవరితోనూ అంతగా కలవడు. మెల్ల కన్ను కారణంగా అసలు పేరుతో కాకుండా 'చిదంబరం' అని పిలుస్తుంటారు. తన లోపాన్ని దాచి పెట్టేందుకు నిత్యం కళ్లద్దాలు ధరిస్తూ ఉంటాడు సోలమన్. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ... తండ్రి చేసిన అప్పుల్ని ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తుంటాడు.
అదే ఊరికి చెందిన శ్రీలీల (సంధ్య వశిష్ట)ను ఇష్టపడినా ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోతాడు. అయితే, ఓ రోజు ధైర్యం తెచ్చుకుని ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. ముందు తనను తాను ప్రేమించుకోమని... కళ్లద్దాలు లేకుండా తిరగాలంటూ చెప్తుంది లీల. దీంతో అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? సోలమన్ కళ్లద్దాలు తీసేసి కనిపించాడా? ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
























