Top Horror Movie : క్షుద్రపూజలు బెడిసి కొడితే వెన్నులో వణుకే! - ఓటీటీలో ట్రెండింగ్ హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్
Satan The Dark OTT : రీసెంట్ తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో టాప్ డ్రెండింగ్‌లో నిలిచింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ సూపర్ థ్రిల్ అందిస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Top Trending Horror Satan The Dark OTT Streaming : కొన్ని సినిమాలు నవ్విస్తాయి. కొన్ని సినిమాలు సస్పెన్స్, థ్రిల్ పంచుతాయి. కొన్ని సినిమాలు భయపెడతాయి. హారర్, సైకో, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్న మూవీస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్‌లో ఉంది. అయితే, ఈ మూవీ చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
క్షుద్రపూజలు బెడిసికొడితే...
క్షుద్రపూజలు, దుష్ట శక్తులు బ్యాక్ డ్రాప్‌గా ఈ స్టోరీ సాగుతుంది. దుష్టశక్తులను నిద్ర లేపే క్షుద్రపూజలు విఫలమైతే ఎలాంటి పరిణామాలు సాగుతాయి అనే కథాంశం ఆధారంగా ఈ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. స్టోరీ విషయానికొస్తే... రెండు వేర్వేరు టైమ్ లైన్స్‌లో ఈ హారర్ కథ సాగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో అస్తినాపురం అనే గ్రామంలో చేసే క్షుద్రపూజలు బెడిసి కొట్టి ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. దీంతో తరాల పాటు ఆ గ్రామాన్ని, ఓ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది.
అలా ప్రస్తుతం కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే)ను, ఆమె కుటుంబాన్ని ఆ దుష్టశక్తి వెంటాడుతుంది. దీని వల్ల మార్సెలిన్ వింతగా వయలెన్స్‌గా ప్రవర్తిస్తుండడంతో పాటు ఆమె పిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ శాపం, దుష్ట శక్తి నుంచి ఆమె తన బిడ్డలను ఎలా కాపాడుకుంది అనేదే స్టోరీ.
Also Read : సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ - నేచరల్ బ్యూటీ ఫస్ట్ మూవీ To ఫస్ట్ క్రష్ ఈ విషయాలు తెలుసా?
టైటిల్ ఏంటి... ఎందులో స్ట్రీమింగ్?
ఈ మూవీ పేరు 'సతన్ : ది డార్క్'. సతన్ అంటే సైతాన్ అని అర్థం. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ హారర్ థ్రిల్లర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి మణికందన్ దర్శకత్వం వహించగా... ఐరా పాలక్, FJ, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలకపాత్రలు పోషించారు.
Also Read : ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















