Red Sandal Wood OTT Release Date: ఎర్ర చందనం స్మగ్లింగ్ ఉచ్చులో యంగ్ బాక్సర్ - రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
Red Sandal Wood OTT Platform: తమిళ మూవీ 'రెడ్ శాండల్ వుడ్' దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ఆడియోతో ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.

Red Sandal Wood OTT Release On Etv Win: క్రైమ్, హారర్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌నే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా తెరకెక్కిన తమిళ మూవీ ఇప్పుడు తాజాగా తెలుగు ఆడియోతో ఓటీటీలోకి రాబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.
నిజ సంఘటనల ఆధారంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా తెరకెక్కిన మూవీ 'రెడ్ శాండిల్ వుడ్'. గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ సోషియో థ్రిల్లర్ తమిళ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో వెట్రి, దివ్య మయూరి, రామచంద్ర రాజు, గణేష్ వెంకట్రామన్, వినోద్ సాగర్ కీలక పాత్రలు పోషించారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఇప్పుడు రెండేళ్ల తర్వాత 'రెడ్ శాండిల్ వుడ్' మూవీ ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 'ఓ యువ బాక్సర్ ప్రమాదకరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. అతను ప్రాణాలతో బయటపడతాడా?' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
View this post on Instagram
Also Read: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
స్టోరీ ఏంటంటే?
నిజ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. చెన్నైలో ఉండే ఓ యువ బాక్సర్‌కు పోలీస్ కావాలనేది డ్రీమ్. తన కల నెరవేర్చుకునేందుకు ఆ బాక్సర్ తీవ్రంగా శ్రమిస్తుంటాడు. తన ప్రియురాలి సోదరున్ని వెతికే క్రమంలో ఏపీ వెళ్లగా అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ ఉచ్చులో చిక్కుకుంటాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా... తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు యత్నిస్తాడు. అయితే, అక్కడ ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్మికులుగా చాలామంది అమాయక తమిళులు ఉన్నారని తెలుసుకుంటాడు. వారిని రక్షించడం సహా అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఓ భారీ స్కామ్ గురించి తెలుసుకుంటాడు.
ఈ స్కామ్ వెలుగులోకి తెచ్చేందుకు ఆ యువ బాక్సర్ చేసిన ప్రయత్నాలేంటి? తమిళ కార్మికులను ఎలా రక్షించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేంటి? స్మగ్లింగ్ ఉచ్చు నుంచి బాక్సర్ బయటపడ్డాడా? అతని డ్రీమ్ నెరవేర్చుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















