Ravi Babu's Razor OTT Streaming : నటుడు, డైరెక్టర్ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ డార్క్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'రేజర్' (Razor). మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేదు. ఇప్పటికే ఒక ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతన్న సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ 'ఆహా' (Aha)లో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న రేజర్... మరో ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video)లోనూ సడన్‌గా సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి రవిబాబే దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు తనీష్, బెనర్జీ, మిర్చి హేమంత్ వీరయ్య చౌదరి, ఇనయ సుల్తానా, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లయింగ్ ఫ్రాంగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించారు. ఎస్ఎస్ రాజేష్ మ్యూజిక్ అందించారు.
Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో 18 మూవీస్ - రామ్ చరణ్ పెద్ది To సింగ్ గీతం... ఇవి వెరీ స్పెషల్
స్టోరీ ఏంటంటే?
విష్ణు (తనీష్) సీసీ కెమెరాలకు చెందిన కంపెనీ నిర్వహిస్తుంటాడు. భార్య లక్ష్మి, కూతురు తేజునే అతని ప్రపంచం. అతను అమర్చిన ఓ కెమెరాలో సీఎం మర్డర్‌కు సంబంధించి విజువల్స్ రికార్డ్ అవుతాయి. సీఎం పీఠం కోసం రాష్ట్ర హోంమంత్రే ఈ దారుణానికి పాల్పడతాడు. అది సీసీ టీవీలో రికార్డు కావడం తెలిసి కంగారు పడతాడు. వెంటనే విష్ణుని దారుణంగా చంపేయిస్తాడు. అయితే, సీఎం మర్డర్ విజువల్స్ మాత్రం వారికి చిక్కకుండా విష్ణు దాచేస్తాడు.
తండ్రి హత్యను ప్రత్యక్షంగా చూసిన చిన్నారి తేజుకు ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఎవరి అండా లేని పాపను ఈజీగా చంపేయొచ్చు అనుకుంటారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పాపను కాపాడే బాధ్యత రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు. కుక్కల సంరక్షకుడిగా పని చేసే రవిబాబు గతం ఏంటి? అతనికి, విష్ణుకి సంబంధం ఏంటి? హోంమంత్రి ముఠా నుంచి పాపను ఎలా రక్షించాడు? సీఎం హత్య కేసులో హోంమంత్రికి శిక్ష పడిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
