Sangeeth Sobhan's Raakaasa OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రీసెంట్ హారర్ ఫాంటసీ 'రాకాస'. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

'రాకాస' డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. థియేటర్లలో ఫుల్ జోష్ కంటిన్యూ కాగా ఓటీటీలోనూ అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని టీం అంచనా వేస్తోంది.

Continues below advertisement

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్, నయన్ సారికలతో పాటు తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, వాసు యింటూరి, జబర్దస్త్ ఫేం రోహిణి, 90s ఫేం రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు.

Also Read : జియో హాట్ స్టార్‌లో నివిన్ పాలీ జోరు - ప్రేమమ్ To లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్... ఎన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

స్టోరీ ఏంటంటే?

వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్) తాను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి హుషారుగా వస్తాడు. అప్పటివరకూ తనతో ముద్దుగా మాట్లాడిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందని తెలిసి షాక్ అవుతాడు. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని తన చిన్నప్పటి ఫ్రెండ్ బాలు (గెటప్ శ్రీను)తో కలిపి ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా తనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ని కలుస్తారు. 

ఈ క్రమంలోని వీరు, సుబ్బలక్ష్మి ప్రేమలో పడతారు. ఇక అదే ఊరి సమీపంలోని కోట కొన్ని సందర్భాల్లో నర బలి కోరుతుంది. మూడు సంకేతాల తర్వాత ఓ మనిషిని కోటలోకి ఆహారంగా పంపాలి. లేకుంటే ఊరి నాశనం తప్పదని... బ్రహ్మ రాక్షసుడు విధ్వంసం సృష్టిస్తాడని నమ్ముతారు ఊరి జనం. అలా ఊహించని రీతిలో వీరూ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ కోటలో ఉన్న రాక్షసుడు ఎవరు? వీరూ కోటలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరూని కాపాడేందుకు బాలు, సుబ్బలక్ష్మి ఏం చేశారు? కోటలో ఉన్న రాక్షసుడి గురించి వీరు తెలుసుకుంది ఏంటి? చివరకు వీరు కోటలోంచి ఎలా బయటపడ్డారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.