Thiruveer's Papam Prathap OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్, పాయల్ రాథాకృష్ణ జంటగా నటించిన రీసెంట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్'. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' సొంతం చేసుకోగా... ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించగా... తిరువీర్, పాయల్‌లతో పాటు అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, ప్రసాద్ బెహర, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కేఎం రాధాకృష్ణ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో అంతంత మాత్రం రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా మరి ఓటీటీలోకి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?
స్టోరీ ఏంటంటే?
ఓ విలేజ్‌లో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అలకలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ప్రతాప్ (తిరువీర్)ది సీతారామపురం అనే విలేజ్. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. తండ్రి వీరయ్య (అజయ్ ఘోష్)కు ఇష్టం లేకపోయినా బుజ్జమ్మతో కలిసి ఏడడుగులు వేస్తాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని, ఇంటి పరువు పోయేలా ఏదైనా చేస్తే చంపేస్తానని కొడుక్కి వార్నింగ్ ఇస్తాడు.
మొదటి 3 రాత్రులు గడిచిన తర్వాత ప్రతాప్‌కు సమస్య ఉందంటూ పంచాయతీ పెడుతుంది బుజ్జమ్మ. తనలోని సమస్య ఏంటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని తెగేసి చెప్పేస్తుంది. అయితే, ఆ సమస్య ఏంటి అనేది మాత్రం పంచాయతీ పెద్దలకు చెప్పదు. దీంతో ప్రతాప్‌పై ఊరి వారికి లేని పోని అనుమానాలు వస్తుంటాయి. అసలు ప్రతాప్ సమస్య ఏంటి? తన సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : విజయ్, త్రిష టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
Also Read : విజయ్ గ్రాండ్ విక్టరీ - ట్రెండింగ్‌లో జన నాయగన్...టైటిల్ మార్చాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్
