అన్వేషించండి

OTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... కానీ ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి వీటిదే

Telugu OTT Releases This Week: ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 22 వరకు... వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న కొత్త సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇది. ఈ వారం సందడి చేయబోయేవి ఏమిటో తెలుసుకోండి.

OTT Releases This Week Telugu: సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ సినిమాలు అన్నీ ఓటీటీల్లోకి వచ్చాయి. ఒక్క మాస్ మహారాజా రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' తప్పించి! ఆ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ జీ5 దగ్గర ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుంచి వీక్షకులకు అందుబాటులోకి వస్తుందని టాక్. అయితే కన్ఫర్మేషన్ లేదు. రవితేజ BMW Movie ఓటీటీ విడుదలపై సస్పెన్స్ నెలకొంది. అది తప్పిస్తే... ఈ వారం సుమారు 15 సినిమాలు, ఒరిజినల్ ఫిలిమ్స్, కొత్త వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ ఇదిగో... ఇంకెందుకు ఆలస్యం, ఓ లుక్ వేయండి.

ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో...
డైరెక్టుగా ఓటీటీలోకి జీవీ ప్రకాష్ సినిమా!
Lucky The Superstar Streaming Date: జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తమిళ్ కామెడీ డ్రామా 'లక్కీ ది సూపర్ స్టార్'. ఇందులో 'ఛాంపియన్', 'విత్ లవ్' ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్. కోవై సరళ, దేవదర్శిని ఇతర తారాగణం. ఓ కుక్క పిల్ల నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కించారు.

రాజకీయ నాయకులకు, కుక్కకు సంబంధం ఏమిటనేది ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ అయ్యే సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రమిది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Theatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

ఫిబ్రవరి 19 నుంచి 'శ్రీ చిదంబరం గారు'...
ఈటీవీ విన్ ఓటీటీలో డిఫరెంట్ సినిమా!
Sri Chidambaram Garu Streaming Date: ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమా 'శ్రీ చిదంబరం గారు'. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించారు. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. తనకు మెల్లకన్ను ఉందని ఆవేదన చెందే ఓ యువకుడు జీవితంలో ఏం తెలుసుకున్నాడు? అనేది కథ. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా.

Also ReadParasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

తెలుగులో విడుదలైన వారానికి ఓటీటీలోకి...
నెట్‌ఫిక్స్‌లోకి మలయాళ సినిమా 'చథా పచ్చ'
ఫిబ్రవరి 13న తెలుగునాట థియేటర్లలో విడుదలైన మలయాళ డబ్బింగ్ 'చథా పచ్చ'. మలయాళంలో జనవరి 22న విడుదల చేశారు. ట్విస్ట్ ఏమిటంటే... ఈ వారం, అంటే ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

'చథా పచ్చ'లో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, లక్ష్మీ మీనన్, విషాక్ నాయర్, సాయి కుమార్, సిద్ధిఖీ ప్రధాన తారాగణం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Also ReadCouple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

  • నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఫిబ్రవరి 16, 2026 నుంచి హాలీవుడ్ వెబ్ సిరీస్ 'రియాలిటీ చెక్: ఇన్ సైడ్ నెక్స్ట్ టాప్ మోడల్' స్ట్రీమింగ్ కానుంది.
  • ఫిబ్రవరి 18, 2026 నుంచి 'బీయింగ్ గొర్డ్సన్ రాంసే' స్ట్రీమింగ్ కానుంది
  • 'ది నైట్ ఏజెంట్' సిరీస్ సీజన్ 3 ఫిబ్రవరి 19, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also ReadSeetha Payanam Review - 'సీతా పయనం' రివ్యూ: విశాఖ to హైదరాబాద్ జర్నీలో లైఫ్ లెసన్స్ - ఐశ్వర్య అర్జున్ సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

జీ5లో కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ 'రాక్షస'
Raakshasa Web Series Streaming Date: జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఒరిజినల్ వెబ్ సిరీస్ 'రాక్షస'. ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. మలప్రభ నదీ తీరంలో భయంకరమైన హత్యలు జరుగుతాయి. అందుకు కారణం ఓ మొసలి అని ప్రచారం జరుగుతుంది. అసలు నిజాన్ని పోలీసులు ఎలా వెలికి తీశారు? అనేది సినిమా. మొత్తం ఏడు  ఎపిసోడ్స్ ఉన్న 'రాక్షస'లో విజయ్ రాఘవేంద్ర ఎస్ఐ హనుమప్ప రోల్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ప్రైమ్ వీడియో ఓటీటీలో కార్తీక్ - అనన్య సినిమా
కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన హిందీ సినిమా 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ'. థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చింది. అదీ రెంటల్ సిస్టమ్. ఇప్పుడు 20వ తేదీ నుంచి సబ్‌స్కైబర్లకు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నారు. 

Also ReadNilave Movie Review - 'నిలవే' రివ్యూ: ప్రెగ్నెంట్ అయినా పెళ్లికి 'నో'... పొయెటిక్ ప్రేమకథలో ట్విస్ట్ - సినిమా ఎలా ఉందంటే?

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సన్నీ సినిమా కూడా!
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమా 'కెన్నెడీ'. జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సినిమా వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. 

Also ReadPeddi Overseas Rights: 'గేమ్ ఛేంజర్' vs 'పెద్ది'... డిజాస్టర్ తర్వాత ఓవర్సీస్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎలాగుంది?

  • ఫిబ్రవరి 18, 2026వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ సినిమా '56 డేస్' స్ట్రీమింగ్ కానుంది.
  • ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 16, 2026 నుంచి 'లాస్ట్ వీక్ టునైట్ విత్ జానీ ఒలీవర్ సీజన్ 13' స్ట్రీమింగ్ కానుంది.
  • సన్ నెక్స్ట్ ఓటీటీలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 'అమోస్ అలెగ్జాండర్' స్ట్రీమింగ్ కానుంది.
  • లయన్స్ గేట్ ఓటీటీలో ఫిబ్రవరి 22న 'బాఫ్టా' అవార్డుల కార్యక్రమం స్ట్రీమింగ్ అవుతుంది. 'హీటెడ్ రైవలరీ' స్ట్రీమింగ్ ఫిబ్రవరి 20న.

Also Read: Funky Movie Review - 'ఫంకీ' రివ్యూ: విశ్వక్ సేన్ సినిమా హిట్టా? ఫట్టా? అనుదీప్ కేవీ సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
రొమాంటిక్ కామెడీ విత్ లవ్ To మూకీ మూవీ గాంధీ టాక్స్ - దిస్ వీక్ ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్‌ కంప్లీట్ లిస్ట్
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Charitha Kamakshi OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
ఓటీటీలోకి వచ్చేసిన 'చరిత కామాక్షి' - నాలుగేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ డ్రామా
Udaya Bhanu: బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
బాలకృష్ణ - బోయపాటి సినిమాకు 'నో' చెప్పా... తల్లిగా బాధ్యతలు, జీ5 వెబ్ సిరీస్ గురించి ఉదయభాను ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget