Horror Thriller Obsession OTT Release Date Locked : కేవలం 7 కోట్ల బడ్జెట్... చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇటు ఇండియాలోనూ రూ.77 కోట్ల కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. ఈ ఏడాది భారత్‌లో రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీనే హాలీవుడ్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession). ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

అబ్సెషన్ (Obsession) ఓటీటీపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం సాగినా తాజాగా అఫీషియల్‌గా అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ యాపిల్ టీవీ (Apple TV)లో జూన్ 30 (మంగళవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రస్తుతానికి రెంటల్ విధానంలో మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

వెన్నులో వణుకు పుట్టించే స్టోరీకి హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఓటీటీలోనూ అంతే రెస్పాన్స్ అందుకోవడం కన్ఫర్మ్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీకి కల్లీ బార్కర్ దర్శకత్వం వహించగా... మైఖేల్ జాన్‌స్టన్, ఇండీ నవరట్టే కీలకపాత్రలు పోషించారు. 

Also Read : This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి - ఒక్క రోజే 4 మూవీస్... మీరు ఏది చూస్తారు?

స్టోరీ ఏంటంటే?

బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) ఓ మ్యూజిక్ స్టోర్‌లో వర్క్ చేస్తుంటాడు. స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే) అంటే అతనికి ఎంతో ఇష్టం. తన ప్రేమను ఆమెకు చెప్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదోనని భయపడుతూ మనసులోనే తన లవ్ దాచుకుంటాడు. ఆమె తనను ప్రేమిస్తే బాగుండునని ఆశ పడుతుంటాడు. ఇదే క్రమంలో అతనికి కోర్కెలు నెరవెర్చే వింత స్టిక్ దొరుకుతుంది. దాన్ని విరగ్గొట్టి మనసులో ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది.

అలా బారోన్ ఆ స్టిక్ విరగ్గొట్టి... 'ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నన్ను నిక్కీ ప్రేమించాలి.' అని కోరుకుంటాడు. దీని ప్రభావంతో బేర్‌ను నిక్కీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. దీంతో అతని ఆనందానికి  హద్దులు ఉండవు. అయితే, ముందు బాగానే ఉన్నా ఆ తర్వాత ప్రేమ పిచ్చిగా మారుతుంది. హద్దులు దాటిన నిక్కీ ప్రేమ ఓ సైకోలా మారుతుంది. దారుణంగా హత్యలు చేస్తుంది. అసలు నిక్కీ అలా ఎందుకు మారింది? బేర్ ఎలా ఆమెను ఎలా భరించాడు? నిక్కీ వల్ల అతని ఫ్రెండ్స్‌కు ఎదురైన ఇబ్బందులేంటి? చివరకు ఈ సమస్యను నిక్కీ ఎలా పరిష్కరించాడు? అనేదే స్టోరీ.

Also Read : This Week OTT Releases : రామ్ చరణ్ పెద్ది To టాప్ తెలుగు సిరీస్ - ఈ వారం ఓటీటీల్లో మూవీస్ డోంట్ మిస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.