తమిళంలో మార్చి నెలలో ‘నీ ఫరెవర్’ అనే సినిమా రిలీజ్ అయింది. ప్రజెంట్ ట్రెండ్, యూత్ మధ్య ఉండే రిలేషన్స్, ప్రేమ, డేటింగ్, యాప్స్ అంటూ నేటి పోకడలు ఎలా ఉన్నాయో చూపిస్తూ తీసిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి, వై జీ మహేంద్రన్, నిజల్గల్ రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, VJ ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి తదితరులు నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.

Continues below advertisement

Also Read: Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

ఏప్రిల్ 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ మూవీని జెన్ స్టూడియెస్ బ్యానర్ మీద పుగళ్, ఈడెన్ నిర్మించారు. అశోక్ కుమార్ కళైవాణి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అశ్విన్ హేమంత్ సంగీతమందించారు. రాజా భట్టాచార్జీ కెమెరామెన్‌గా పని చేశారు. థియేటర్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో పాటుగా, మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఇక ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Continues below advertisement

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?