అన్వేషించండి

Mothers Day Special Movies : మదర్స్ డే స్పెషల్ - ఈ మూవీస్ డోంట్ మిస్... అమ్మ ప్రేమను కళ్లకు కట్టేలా...

Mothers Day Movies : మదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా వచ్చిన మూవీస్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మదర్స్ డే సందర్భంగా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

Mothers Day Special Top Trending Movie Complete List : అమ్మ... సృష్టిలో గొప్ప పదం. జీవితంలో ఎవరికైనా తొలి గురువు అమ్మే. చందమామను చూపించి గోరుముద్దలు తినిపించి... నడక నేర్పి... విద్యా బుద్ధులతో పాటు జీవితపు పాఠాలు నేర్పిన అమ్మ ప్రేమను వర్ణించలేం. మదర్ సెంటిమెంట్ మూవీస్ అనగానే కొంత ఎమోషనల్ అవుతుంటాం. తల్లీ కొడుకుల మధ్య ఎమోషన్, సెంటిమెంట్ ప్రధానాంశంగా వచ్చిన మూవీస్ ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మదర్స్ డే స్పెషల్‌గా టాప్ ట్రెండింగ్ మదర్ సెంటిమెంట్ మూవీస్...

అమ్మ : సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎవర్ గ్రీనే. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శరత్ బాబు కీలకపాత్ర పోషించారు. రామోజీరావు నిర్మించారు. ఈటీవీ విన్‌తో పాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.

మాతృదేవోభవ : నాజర్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకోని వారుండరు. అనాథలుగా పెరిగి పెద్దయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట. వారికి ముగ్గురు పిల్లలు. తాగుడుకు బానిసైన తండ్రి. క్యాన్సర్ బారిన పడిన తల్లి. ఇలా ఆద్యంతం ఎమోషనల్‌గా నడుస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

అమ్మ రాజీనామా : కుటుంబం, కొడుకుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఓ అమ్మ కథ 'అమ్మ రాజీనామా'. శారద, కైకాల సత్యనారాయణ, సాయికుమార్, దాసరి నారాయణరావు, చలపతిరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మనసును కదిలించే ఈ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చు.

నాని : మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ పేరు వింటేనే మనకు 'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ...' పాటే గుర్తొస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్‌లో ఉంది.

Also Read : బాలయ్య, కొరటాల మూవీ - ఎవరూ ఊహించని టైటిల్!... గాడ్ ఆఫ్ మాసెస్ ట్రెండ్ వైరల్

సింహరాశి : కన్నబిడ్డ ఎదురుగానే ఉన్నా ముట్టుకోలేని స్థితి ఆ తల్లిది. చిన్నప్పుడే తల్లి  ప్రేమకు దూరమైన కొడుకు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఈ మూవీ స్టోరీ ఉంటుంది. యూట్యూబ్‌లో చూడొచ్చు.

పెదబాబు : జాతకంలో దోషం ఉందని చిన్నప్పుడే తల్లికి దూరమైన కొడుకు కథ. కొడుకు ఎదురుగానే ఉన్నా మనసారా దగ్గరకు తీసుకోలేని ఓ అమ్మ కథ. జగపతి బాబు, శరత్ బాబు, సుహాసిన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎమోషనల్‌గా సాగుతుంది. యూట్యూబ్‌లో చూడొచ్చు.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి : బాక్సర్ కావాలనుకునే కొడుకు, ఫ్రెండ్‌లా అతని డ్రీమ్‌కు సపోర్ట్ చేసే తల్లి. అమ్మ ప్రేమను ఆవిష్కరించే మూవీ ఇది. రవితేజ, ఆసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు 'SunNXT'లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఛత్రపతి : యాక్షన్ సీక్వెన్స్, గూండాయిజం వంటి సీన్స్ పక్కన పెడితే ఈ మూవీలో తల్లి నుంచి బిడ్డ విడిపోవడం, తిరిగి కలవడం చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చు.

ఇట్లు అమ్మ : ఓ అమ్మ తన కొడుకు అకాల మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసే పోరాటమే ఇట్లు అమ్మ మూవీ. రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 'సోనీ లివ్'లో అందుబాటులో ఉంది.

ఒకే ఒక జీవితం : చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అమ్మ ప్రేమకు దూరమైన కొడుకు. టైమ్ మిషన్‌తో మళ్లీ గతంలోకి వెళ్లి అమ్మను చూస్తే... ఇదే కాన్సెప్ట్‌తో ఎమోషనల్‌గా సాగుతుంది ఈ మూవీ. శర్వానంద్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 'సోనీ లివ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ - నేచరల్ బ్యూటీ ఫస్ట్ మూవీ To ఫస్ట్ క్రష్ ఈ విషయాలు తెలుసా?

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ : శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ అమ్మ ప్రేమను తెలియజేసే చిత్రం. క్యాన్సర్ బారిన పడిన తల్లి తన బిడ్డల కోసం ఏం చేసింది? అనేదే స్టోరీ. యూట్యూబ్‌తో పాటు జియో హాట్ స్టార్‌లోనూ అందుబాటులో ఉంది.

బిచ్చగాడు : ప్రమాదానికి గురైన తన తల్లి ప్రాణాల కోసం కోటీశ్వరుడైన ఓ కొడుకు చేసిన గొప్ప త్యాగం. తల్లీ కొడుకుల అనుబంధానికి నిర్వచనం ఈ మూవీ. 'SunNXT', 'Jio Hotstar' ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

రఘువరన్ బీటెక్ : నిరుద్యోగిగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కొడుకుకు సపోర్ట్ చేసే తల్లి. ఓ రోజు ఊహించని విధంగా ఆ కొడుక్కి దూరమైతే... ఆ తర్వాత ఓ గొప్ప ఇంజినీరింగ్ ఎదిగిన ఆ యువకుడి కథే ఈ స్టోరీ. ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.

కేజీఎఫ్ - మదర్ సెంటిమెంట్ ప్రధానాంశంగా సాగే స్టోరీ కేజీఎఫ్. తన తల్లి చెప్పిన, ఇచ్చిన మాట కోసం ఓ యువకుడు ఓ సామ్రాజ్యానికి ఎలా రాజయ్యాడు అనేదే స్టోరీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

గుంటూరు కారం - చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్లిన తల్లి. ఆమె ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు. తల్లీ కొడుకుల మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన మూవీ గుంటూరు కారం. మహేశ్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ... నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Also Read : విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ - పడి లేచిన కెరటంలా రణబాలి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Athiradi OTT : అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Embed widget