Ravi Teja's Mass Jathara OTT Streaming : మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర'. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఓటీటీ డీల్ విషయంలో వెనకడుగు వేసిందనే ప్రచారం సాగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ శుక్రవారం నుంచి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు 5 వారాల తర్వాత మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించగా... రవితేజ, శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, హైపర్ ఆది, రాజేంద్ర ప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
Also Read : వారానికే ఓటీటీలోకి రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ 'పాంచ్ మినార్' - సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మూవీ
స్టోరీ ఏంటంటే?
లక్ష్మణ్ భేరీ (రవితేజ) నిజాయితీ గల రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేని కేసులను కూడా తన అండర్‌లోకి తెచ్చుకుంటూ సాల్వ్ చేయాలని చూస్తూ అవమానాలు ఎదుర్కొంటాడు. అలా ఓ మంత్రి కొడుకును కొట్టడంతో అల్లూరి జిల్లా అడవి వరానికి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ రైతులతో గంజాయి సాగు చేయిస్తూ కలకత్తాకు ఎక్స్‌పోర్ట్ చేయాలని చూస్తుంటాడు శివుడు (నవీన్ చంద్ర). పోలీస్ అధికారుల అండ, అర్థ బలంతో ఆ ప్రాంతాన్నే శాసించే శివుడి అరాచకాలను లక్ష్మణ్ ఎలా ఎదుర్కొన్నాడు?
అసలు గంజాయి స్మగ్లింగ్ గురించి తెలుసుకున్న శివుడు దాన్ని ఎలా అడ్డుకున్నాడు? తులసితో లక్ష్మణ్ ఎలా ప్రేమలో పడ్డాడు? తులసికి గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధం ఏంటి? చివరకు శివుడిని లక్ష్మణ్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.