Killer Artiste OTT: అమ్మాయిలే టార్గెట్... సైకో కిల్లర్ అరాచకం - 6 నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్
Killer Artiste OTT Platform: మరో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'కిల్లర్ ఆర్టిస్ట్' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు 6 నెలల తర్వాత ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Santosh Kalwacharla's Killer Artiste OTT Streaming On Amazon Prime Video: సైకో, హారర్, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీ ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచేందుకు మరో తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్?
సంతోష్ కల్వచర్ల, క్రిషికా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ 'కిల్లర్ ఆర్టిస్ట్'. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు దాదాపు 6 నెలల తర్వాత ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో రెెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూడాలంటే రూ.99 చెల్లించి చూడొచ్చు.
ఈ మూవీకి రతన్ రిషి దర్శకత్వం వహించగా... సంతోష్, క్రిషికాలతో పాటు బిగ్ బాస్ ఫేం సోనియా ఆకుల కీలక పాత్ర పోషించారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, కాళకేయ ప్రభాకర్, వినయ్ వర్మ, సత్యం రాజేష్, స్నేహ మాధురి, సుదర్శ తదితరులు నటించారు.
Also Read: వైబ్ ఒక్కటే కాదు... 'మిరాయ్'లో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ కూడా కట్ - అది బయటకు రాదేమో!
స్టోరీ ఏంటంటే?
'కిల్లర్ ఆర్టిస్ట్' కథ విషయానికొస్తే... అమ్మాయిల వరుస హత్యలు ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. విక్కీ (సంతోష్), స్వాతి (స్నేహ మాధురి) ఇద్దరూ అన్నా చెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉంటారు. ఓ రోజు ఇద్దరూ ఇంట్లో ఉన్న టైంలో కొందరు దుండగులు వీరిపై దాడి చేసి విక్కీ చెల్లెల్ని చంపేస్తారు. తన కళ్ల ముందే చెల్లెల్ని చంపేయడంతో ఓ విధమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు విక్కీ. ఇలాంటి టైంలో అతని జీవితంలోకి జాను (క్రిషికా పటేల్) వస్తుంది.
మరోవైపు నగరంలో ఓ సైకో కిల్లర్ మాస్క్ ధరించి అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. అతన్ని పోలీసులు పట్టుకోగా ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కనిపించడంతో తన చెల్లెల్ని చంపింది సైకోనే అని విక్కీ అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి తప్పించుకున్న సైకో జాను బర్త్ డే పార్టీలో ప్రత్యక్షం అవుతాడు. అక్కడే తన చెల్లెల్ని చంపింది సైకో కాదని విక్కీ తెలుసుకుంటాడు. అసలు నగరంలో వరుసగా హత్యలు చేస్తుంది ఎవరు? విక్కీ చెల్లెల్ని చంపింది సైకోయేనా? తన చెల్లెల్ని చంపిన హంతకున్ని విక్కీ పట్టుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















