Jurassic World Rebirth OTT Streaming On Amazon Prime Video: డైనోసార్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది 'జురాసిక్ పార్క్'. ఈ ఫ్రాంచైజీలో వచ్చే హాలీవుడ్ మూవీస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి భూమి మీదకు వస్తే ఎలా ఉంటుందో అనే ఊహకు ప్రతిరూపమే ఈ సినిమాలు. జులై 2న వచ్చిన 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' ఆడియన్స్‌ను అలరించింది. ఇప్పుడు నెల రోజుల్లోపే సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటే యాపిల్ ప్లస్ టీవీల్లోనూ అందుబాటులోకి వచ్చింది. గరేత్ ఎడ్వెర్డ్స్ దర్శకత్వం వహించగా... డేవిడ్ కోప్ స్టోరీ అందించారు. స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్ర పోషించగా... ఆడ్రినా మిరాండా, ఎడ్ స్క్రెయిన్, జొనాథన్ బెయిలీ కీలక పాత్రలు పోషించారు.
1993లో ప్రారంభమైన జురాసిక్ ప్రపంచం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఫస్ట్ మూవీ తర్వాత ఇదే ఫ్రాంచైజీలో చాలా మూవీస్ వచ్చినా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. లేటెస్ట్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' డొమినియన్ సంఘటనల తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. డైనోసార్ల డీఎన్ఏతో ఎన్నో భయంకర వ్యాధులకు మెడిసిన్ తయారు చేసే స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా తాజా మూవీని తెరకెక్కించారు.
Also Read: చంద్రబాబును ప్రేమించిన హీరోయిన్... ఆ అమ్మాయి ఎవరు? 'మయసభ'పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి
ఏంటీ డైనోసార్స్ స్టోరీ
గుండెజబ్బులు సహా ఎన్నో భయంకర వ్యాధులను నయం చేసే శక్తి మూడో అరుదైన డైనోసార్ల రక్తంలోని డీఎన్ఏలో ఉంటుంది. ఆ డీఎన్ఏతో మెడిసిన్ డెవలప్ చెయ్యొచ్చంటూ సైంటిస్టులు కనిపెడతారు. అయితే, కేవలం బతికున్న వాటి నుంచి మాత్రమే ఆ డీఎన్ఏను సేకరించాలి. దీంతో ఓ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ మేరకు జోరా బెన్నెట్‌తో (స్కార్లెట్ జాన్సన్) మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్) అనే ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు.
అలాంటి డైనోసార్స్ ఈక్వెడార్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తిస్తారు. డాక్టర్ హెన్సీ (జొనాథన్ బెయిలీ), అడ్వెంచర్ మ్యాన్ డంకన్ (మహర్షాలా అలీ) ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగం అవుతారు. అందరూ కలిసి సాహస ప్రయాణం మొదలుపెట్టగా... అక్కడ అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ఎన్నో రకాల డైనోసార్ల జాతులను గుర్తిస్తారు. అసలు ఆ డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా? ఈ సాహస ప్రయాణంలో వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఈ ఓటీటీల్లో జురాసిక్ ఫ్రాంచైజీ మూవీస్
| మూవీ | ఇయర్ | ఓటీటీ ప్లాట్ ఫాం |
| జురాసిక్ పార్క్ | 1993 | పీకాక్, జీ5, జియో సినిమా |
| ది లాస్ట్ వరల్డ్ (జురాసిక్ పార్క్) | 1997 | పీకాక్, జియో సినిమా |
| జురాసిక్ పార్క్ 3 | 2001 | పీకాక్, జియో సినిమా |
| జురాసిక్ వరల్డ్ | 2015 | పీకాక్, జియో సినిమా |
| జురాసిక్ వరల్డ్ (ఫాలెన్ కింగ్డమ్) | 2018 | పీకాక్, జియో సినిమా |
| జురాసిక్ వరల్డ్ డొమినియన్ | 2022 | పీకాక్, జియో సినిమా |