(Source: Poll of Polls)
Idli Kottu OTT : ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - 5 భాషల్లో స్ట్రీమింగ్... ఆ ప్లాట్ ఫాంలో వెంటనే చూసెయ్యండి
Idli Kottu OTT Streaming : కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కొట్టు' ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగుతో పాటు 5 భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Dhanush's Idli Kottu Movie OTT Streaming : కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇడ్లీ కడై'. తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా రీమేక్ చేశారు. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.
5 భాషల్లో స్ట్రీమింగ్
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా మంగళవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 'ఈ రోజు మా పరిసరాల్లో కొత్త 'ఇడ్లీ కొట్టు' ప్రారంభమైంది. అసలు ఆ హైప్ దేని గురించో చూద్దాం.' అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా... కానీ ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎమోషనల్
మూవీలో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సత్య రాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మించగా... జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. పుట్టిన ఊరు, గ్రామంలో సొంత వ్యాపారంతో ఓ తండ్రి అనుబంధం, గొప్పగా బతకాలని భావించే కొడుకు, ఫ్యామిలీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ కలిపి ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా మూవీని రూపొందించారు.
స్టోరీ ఏంటంటే?
శంకరాపురం అనే ఊరిలో శివకేశవులు (రాజ్ కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఎంతో ఫేమస్. చుట్టు పక్కల అన్నీ గ్రామాల ప్రజలు అక్కడికే వచ్చి ఇడ్లీలు తింటారు. అయితే, తండ్రి బిజినెస్‌ను కేవలం ఊరికే పరిమితం కాకుండా ఓ ఫ్రాంచైజీలా డెవలప్ చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు అతని కొడుకు మురళి (ధనుష్). తన కొడుకు ప్రొపోజల్‌కు తండ్రి అంగీకరించడు. దీంతో ఉన్న ఊరిని, కన్నవాళ్లను వదిలేసి పట్నం వచ్చేస్తాడు మురళి.
హోటల్ మేనేజ్మెంట్ చదివిన మురళి... ఎన్నో ప్రయత్నాల తర్వాత బ్యాంకాక్‌లో పాపులర్ రెస్టారెంట్ చైన్ ఏఎఫ్‌సీ అధినేత విష్ణువర్దన్ (సత్యరాజ్) వద్ద ఉద్యోగంలో చేరతాడు. అతని పద్ధతి నచ్చి తన కూతురిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు విష్ణు. పెళ్లికి 2 వారాల ముందు మురళి తండ్రి శివకేశవులు చనిపోయాడనే న్యూస్ తెలుస్తుంది. దీంతో వెంటనే ఊరికి బయలుదేరిన మురళి తన తండ్రి చివరి కోరిక మేరకు 'ఇడ్లీ కొట్టు' చూసుకోవాలని భావిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విష్ణు వర్దన్ దీన్ని ఎలా తీసుకున్నాడు? విష్ణు కొడుకు అశ్విన్ ధనుష్ ఇడ్లీకొట్టును ఎందుకు నాశనం చేయాలని ప్లాన్ చేశాడు? కల్యాణి (నిత్యా మీనన్)కి మురళికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















