Gandhi Talks OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సైలెంట్ మూవీ - 'గాంధీ టాక్స్' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gandhi Talks OTT Platform : డిఫరెంట్ సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించగా... రెహమాన్ మ్యూజిక్ అందించారు.

Vijay Sethupathi's Gandhi Talks OTT Release Date Locked : కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఊహించినంత రెస్పాన్స్ అందుకోలేదు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకోగా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీకి కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించగా... అరవింద్ స్వామి, విజయ్ సేతుపతిలతో పాటు అదితీ రావ్ హైదరి, మహేశ్ మంజ్రేకర్, జరీనా వహబ్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... జీ స్టూడియోస్, క్యూరియస్ మూవీ మిల్ సంయుక్తంగా నిర్మించాయి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలు, మ్యూజిక్‌తోనే సినిమా మొత్తం నడిపించారు.
Also Read : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్ పేర్లు ఇవే - మెగాస్టార్ పేరు కలిసి వచ్చేలా వారసుడి నేమ్... అర్థం ఏంటో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
ముంబయిలోని ధారావిలో నిరుపేద కుర్రాడు మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి) తన తల్లితో కలిసి ఉంటాడు. బాగా చదువుకున్నా తన చదువుకు తగిన ఉద్యోగం దొరకదు. ముంబయి మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా 50 వేల లంచం అడుగుతారు. తన తల్లి ఆరోగ్యం బాగు పడాలన్నా తాను ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్ హైదరి)ని పెళ్లి చేసుకోవాలన్నా ఆ జాబ్ చాలా ముఖ్యం. దీంతో తన ఎథిక్స్ పక్కన పెట్టి మరీ ఓ తప్పుడు పనికి సిద్ధమవుతాడు.
ఇదే టైంలో ముంబయిలో బోస్ మన్ (అరవింద్ స్వామి)ది మరో కథ. ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్‌గా ఓ వెలుగు వెలిగిన అతను అనుకోకుండా బిజినెస్‌లో తీవ్ర నష్టాలు వచ్చి ఒక్కసారిగా రోడ్డున పడతాడు. అతని వ్యాపార సామ్రాజ్యమంతా కుప్పకూలుతుంది. అప్పుల ఒత్తిడితో సొంత బంగ్లాను కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు బోస్ మన్ ఓ ఆలోచన చేస్తాడు. అదేంటి? డబ్బు వల్ల విష్ణు, బోస్ ఎలా ఎక్కడ కలుసుకున్నారు? వీరి జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
























