'ఫర్జీ' రెండో సీజన్‌లో యుక్తి తరేజా ప్రధాన కథానాయికగా నటించనున్నారు. ఆమె ఈ సీజన్‌కు ఏకైక హీరోయిన్ అని కూడా స్పష్టం చేశారు.
Farzi Season 2: 'ఫర్జీ' సీజన్ 2లో టాలీవుడ్ హీరోయిన్... ఫ్లాప్ లెగ్ ముద్రను హిందీ సిరీస్ పోగొడుతుందా?
Farzi Season 2 Main Lead Actress: షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డికె తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ సీజన్ 2'. ఇందులో టాలీవుడ్ హీరోయిన్, నార్త్ ఇండియన్ బ్యూటీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

- ఫర్జీ సీజన్ 2లో రాశీ ఖన్నా స్థానంలో యుక్తి తరేజా.
- యుక్తి తరేజా ప్రధాన కథానాయికగా ఏకైక పాత్రలో నటిస్తుంది.
- ఆమె చిత్రీకరణ మెజారిటీ పూర్తైంది, వచ్చే ఏడాది విడుదల.
'ఫర్జీ' వెబ్ సిరీస్ (Farzi Web Series)తో బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) ఓటీటీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డికె దర్శకత్వంలో ఆ సిరీస్ తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించింది. అందులో రాశీ ఖన్నా నటించారు. ఓ విధంగా ఆమె మెయిన్ హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె బదులు మరొక హీరోయిన్‌ను ఎంపిక చేశారు.
రాశీ ఖన్నాను రీప్లేస్ చేసిన యుక్తి తరేజా!?
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా వచ్చిన 'ఫర్జి' మొదటి సీజన్ క్లిఫ్ హ్యాంగర్‌తో ముగిసింది. ఆ సీజన్‌తో కథ ఎండ్ కార్డు వేయలేదని, మరొక సీజన్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రెండో సీజన్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్ మధ్య పోటీ ఉంటుందని తెలిసింది. ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో హీరోయిన్ మారారు.
Also Read: OM New Release Date - మాజీ మామ కోసం వెనక్కి వెళ్లిన ధనుష్... 'ఓం' కొత్త రిలీజ్ డేట్ ఇదుగో
సాధారణంగా మొదటి సీజన్‌లో నటీనటులు రెండో సీజన్‌లో కూడా కంటిన్యూ అవుతారు. అయితే... హీరోయిన్స్ విషయంలో మార్పులు జరగడం సహజం. ఈ క్రమంలో 'ఫర్జీ సీజన్ 2'లో కథానాయికగా యుక్తి తరేజా ఎంపిక అయ్యారు. మొదటి సీజన్‌లో రాశీ ఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించారు. ఆ సీజన్‌లో ఆమె నకిలీ కరెన్సీ నెట్‌వర్క్‌ను వెలుగులోకి తీసుకు రావడం కోసం కష్టపడే పోలీసుగా... కథానాయకుడి అసలు రూపం తెలియకుండానే అతనితో ప్రేమలో పడుతుంది. అయితే... రెండో సీజన్‌లో ఆమె కనిపించే అవకాశం ఉంటుందో? లేదో? ఎందుకంటే...
Also Read: Sreemukhi Saree Photos - నాన్న తీసిన ఫోటోలు... సొంతూరిలో చీర కట్టిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి
యుక్తి తరేజా ఓ ఇంటర్వ్యూలో తాను 'ఫర్జీ సీజన్ 2'లో మెయిన్ హీరోయిన్ అని పేర్కొన్నారు. అంతే కాదు... ఈ సీజన్‌లో ఏకైక హీరోయిన్ కూడా తానేనని స్పష్టం చేశారు. దాంతో రాశీ ఖన్నా క్యారెక్టర్ కనిపించే అవకాశం లేదని అర్థమైంది. "ఆల్రెడీ నా పాత్రకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేశా. కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది" అని యుక్తి తరేజా వివరించారు. సో... లాస్ట్ సీజన్‌లో మేఘాగా కనిపించిన రాశీ ఖన్నా, రెండో సీజన్‌లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. తెలుగులో 'రంగబలి', 'కె ర్యాంప్', 'కేజీక్యూ' సినిమాల్లో యుక్తి తరేజా నటించారు. ఆ మూడు ఫ్లాపులే. ఇప్పుడు 'ఫర్జి' సీజన్ 2తో ఫ్లాప్ లెగ్ ముద్ర పోయి, హిట్ వస్తుందేమో చూడాలి.
'ఫర్జీ' సిరీస్ రెండో సీజన్ విడుదల విషయంపై కూడా స్పష్టత వచ్చింది. యుక్తి తరేజా చెప్పిన దాని ప్రకారం... వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదటి సీజన్ సంచలన విజయం సాధించడంతో రాజ్ అండ్ డికె దర్శకత్వంలో రానున్న రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Frequently Asked Questions
'ఫర్జీ' రెండో సీజన్‌లో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు?
'ఫర్జీ' రెండో సీజన్‌లో రాశీ ఖన్నా పాత్ర ఉంటుందా?
లేదు, 'ఫర్జీ' రెండో సీజన్‌లో రాశీ ఖన్నా పాత్ర కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. యుక్తి తరేజా ఏకైక హీరోయిన్ అని పేర్కొన్నారు.
'ఫర్జీ' రెండో సీజన్ ఎప్పుడు విడుదల కానుంది?
'ఫర్జీ' సిరీస్ రెండో సీజన్‌ను వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
'ఫర్జీ' రెండో సీజన్‌లో ప్రధాన నటీనటులు ఎవరు?
రెండో సీజన్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్ మధ్య పోటీ ఉంటుందని తెలిసింది. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















