Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dose OTT Platform : ఒక్క మూవీ ఒకే రోజు ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా మలయాళంలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

Siju Wilson's Dose OTT Release Date Locked : Dose OTT : థ్రిల్లర్ కంటెంట్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ మలయాళ థ్రిల్లర్ మూవీస్ ఓటీటీల్లో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ కానుంది. ఇంతకూ ఆ మూవీ ఏంటంటే...
ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
రీసెంట్‌గా మలయాళంలో వచ్చిన సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ డోస్ (Dose). మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. జులై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, సింప్లీ సౌత్, మనోరమ మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించగా... సిజు విల్సన్, అశ్విన్ కుమార్, దృశ్య రఘునాథ్, జగదీష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.
Also Read : Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
స్టోరీ ఏంటంటే?
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణాల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఆస్పత్రిలో ఒకేసారి వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. అందులో పని చేసే వైద్యుడు (సిజు విల్సన్) దీని వెనుక కారణాలను కనిపెట్టేందుకు యత్నిస్తాడు. ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాల వల్లే ఈ మరణాలు జరుగుతున్నాయని తెలుసుకుంటాడు. ఓ ఇన్వెస్టిగేటర్‌తో కలిసి దీనిపై ఆరా తీస్తుంటాడు. దీంతో వీరికి మెడికల్ మాఫియా నుంచి థ్రెట్ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొని ఆస్పత్రిలో జరిగే అక్రమాలను సదరు డాక్టర్ ఎలా బయటపెట్టాడు? ఆస్పత్రిలో వరుస మరణాలు ఎందుకు సంభవించాయి? దీని వెనుక ఉన్న మాఫియా ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























