Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ - రెండు ప్లాట్ పామ్స్‌లో చూడొచ్చు... కానీ
Dhurandhar 2 OTT Platform : రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అయితే, ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుండగా... బిగ్ ట్విస్ట్ నెలకొంది.

Ranveer Singh's Dhurandhar 2 OTT Release Date Locked : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1,800 కోట్లకు పైగా సాధించి బాహుబలి 2 రికార్డును సైతం అధిగమించింది. ఇప్పటికీ థియేటర్లలో ట్రెండింగ్‌లో ఉన్న మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ధురంధర్ 2' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే, విదేశాల్లో ఈ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. భారత్‌లో తప్ప ఇతర దేశాల్లో ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అటు, ఫస్ట్ పార్ట్ 'ధురంధర్' కూడా నెట్ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియాలో మాత్రం జియో హాట్ స్టార్‌లోనే అందుబాటులోకి రానుంది. అయితే, ఇండియాలో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ తేదీ కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఈ నెల 15 నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం సాగుతోంది. హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి - డెకాయిట్ నుంచి వాలా 2 వరకూ... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... గతేడాది వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్ 2' దాదాపు 2 నెలలైనా అంతే రేంజ్‌లో ఆక్యుపెన్సీతో దూసుకెళ్లింది. రణవీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఉగ్ర దాడులను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? జస్కరిత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్) హమ్జాగా పేరు మార్చుకుని ఎందుకు పాకిస్థాన్ వెళ్లాల్సి వచ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?
ధురంధర్ 3 ఉంటుందా?
'ధురంధర్ 3' ఉంటుందా? ఇదే ప్రశ్న అటు రణవీర్ అభిమానులు, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మెదిలే ప్రశ్న. దీనికి తాజాగా సూపర్ గుడ్ న్యూస్ అందించారు నిర్మాత జ్యోతి దేశ్ పాండే. రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ మేకింగ్ విశేషాలను షేర్ చేసుకున్నారు. ధురంధర్ ఇంకా కంప్లీట్ కాలేదని అన్నారు.
'ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మా దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ప్లాన్ రెడీగా ఉంది. మా అందరికీ హిట్ అవసరమైన టైంలో మేము ధురంధర్ రూపొందించాం. దీంతో నేను, ఆదిత్య, రణవీర్ సింగ్ ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం.' అని పేర్కొన్నారు. దీంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొందరు డాక్యుమెంటరీ అంటూ గెస్ చేస్తుండగా... మరికొందరు 'ధురంధర్ 3' అప్డేట్ కావొచ్చని అంటున్నారు.
Also Read : జిమ్ డ్రెస్‌లో ఇస్మార్ట్ బ్యూటీ - క్యూట్ లుక్స్‌తో హీట్ పెంచేస్తోన్న నభా నటేష్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















