Divya Sripada's Romatic Drama Charitha Kamakshi OTT Release Date Locked : 'కలర్ ఫోటో', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్ దివ్య శ్రీపాద. ఆమె లీడ్ హీరోయిన్‌గా నటించిన మూవీ 'చరిత కామాక్షి'. 2021లోనే ఈ మూవీ అనౌన్స్ చేయగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. తాజాగా డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'చరిత కామాక్షి' మూవీ మార్చి 5 నుంచి డైరెక్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి చందు సాయి దర్శకత్వం వహించగా... నవీన్‌కు జోడీగా శ్రీపాద నటించారు. వీరితో పాటే బబ్లూ పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సతీష్ పారిపల్లి, అంజి మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
'లవ్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో కూడిన ఆత్మీయ కథ' అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఈ మూవీకి అబు మ్యూజిక్ అందించగా... రజినీ రెడ్డి నిర్మించారు. మూవీలో సంప్రదాయ చీరకట్టులో, గృహిణిగా శ్రీపాద లుక్ వేరే లెవల్‌లో ఉంది.
Also Read : సంగీత్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక డ్యాన్స్ - బెస్ట్ సాంగ్స్ విత్ బెస్ట్ మూమెంట్స్... వీడియో వైరల్
