Bhadrakaali OTT: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' - 800 కోట్ల ల్యాండ్ స్కామ్ ఇప్పుడే చూసెయ్యండి
Bhadrakaali OTT Platform: తమిళ హీరో విజయ్ ఆంటోని రీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

Vijay Antony's Bhadrakaali OTT Streaming: కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని రీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి'. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి 'భద్రకాళి' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ అందుబాటులోకి వచ్చింది. 'మెదడు, వ్యూహం, పవర్. కింగ్ ఆఫ్ మైండ్స్ వచ్చాడు.' అంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళంలో 'శక్తి మురుగన్'గా తెరకెక్కిన మూవీని తెలుగులో 'భద్రకాళి'గా రీమేక్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.
View this post on Instagram
Also Read: ఐపీఎస్ ప్రభాస్... జస్ట్ హేవ్ వన్ బ్యాడ్ హేబిట్ - 'స్పిరిట్' మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది
ఈ మూవీలో విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. దీంతో పాటే నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా... సునీల్ కృపలానీ, తృప్తి రవీంద్ర, వాగై చంద్రశేఖర్, మాస్టర్ కేశవ్, సెల్ మురుగన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే?
సెక్రటేరియట్‌లో కిట్టు (విజయ్ ఆంటోనీ) ఓ పవర్ ఫుల్ బ్రోకర్. ఉద్యోగాల దగ్గర నుంచీ కాంట్రాక్టుల వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనైనా తనదైన శైలి, నేర్పుతో చక్కబెడుతుంటాడు. వ్యవస్థలో పెద్దలను ఉపయోగించుకుని ఎలాంటి పనైనా చేయించుకుంటాడు. అలా కేంద్ర మంత్రికి సంబంధించి రూ.800 కోట్ల భూమి వ్యవహారంలో వేలు పెడతాడు. ఇదే టైంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవడం మంత్రికి తలనొప్పిగా మారగా సీక్రెట్‌గా విచారణ చేయిస్తాడు.
ఆ ఇన్వెస్టిగేషన్‌లో దీని వెనుక ఉన్నది కిట్టు అని తెలిసి అందరూ షాక్ అవుతారు. లాబీయింగ్స్ రూపంలో అతను రూ.6 వేల కోట్లు వెనుకేసినట్లు తెలుసుకుంటారు. దీంతో కిట్టును అరెస్ట్ చేయగా... రాష్ట్రపతి రేసులో ఉన్న అభ్యర్థి అభ్యంకర్ (సునీల్ కిర్బలానీ)కి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు అభ్యంకర్‌కు, కిట్టుకు ఉన్న సంబంధం ఏంటి? అభ్యంకర్‌ను రాష్ట్రపతి కాకుండా కిట్టు ఎందుకు అడ్డుకోవాలని చూస్తాడు? దేశంలో నేతలను తన చెప్పు చేతల్లో పెట్టుకున్న అభ్యంకర్‌ను తలకు మించిన కేసుల్లో ఉండే కిట్టు ఎలా అడ్డుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















