Barabar Premistha OTT : ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Barabar Premistha OTT Platform : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన రెండో మూవీ 'బరాబర్ ప్రేమిస్తా'. దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Chandra Hass's Barabar Premistha Movie OTT Streaming : 'గుంజి గుంజి గు****'... ఈవెంట్‌లో ఈ ఒక్క సాంగ్‌తో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పేరు మార్మోగిపోయింది. జర్నలిస్టుతో గొడవ, సోషల్ మీడియాలో విమర్శలు, వరుసగా ట్రోలింగ్... బూతు పదాలు వాడారంటూ ఈ కాంట్రవర్సీ సాగుతుండగానే కొత్త మూవీ 'బరాబర్ ప్రేమిస్తా' థియేటర్లలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓ రెండు రోజులు హడావుడి కనిపించినా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దాదాపు 3 నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో చూడొచ్చంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో మూవీ శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకుగానే కాకుండా తనదైన మేనరిజంతో యాటిట్యూడ్ స్టార్ అనే పేరు సంపాదించుకున్నాడు చంద్రహాస్. ఈ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా... మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మీసాల లక్ష్మణ్, మధునందన్, అభయ్ నవీన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అందించారు.
చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'రామ్ నగర్ బన్నీ' అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'బరాబర్ ప్రేమిస్తా' కూడా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి 3 నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.
View this post on Instagram
Also Read : సైలెంట్‌గా అషు రెడ్డి ఎంగేజ్మెంట్! - కాబోయే వరుడు ఎవరు... ఆ ఫోటోస్ వెనుక సస్పెన్స్ ఏంటి?
స్టోరీ ఏంటంటే?
రుద్రారం అనే గ్రామంలో కర్మానీ, ధర్మానీ అనే రెండు వర్గాలకు ఎప్పుడూ పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఇద్దరి మధ్య ఉంటుంది. ఊరిలో ఆధిపత్యం కోసం వీరు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇలాంటి వివాదాల నడుమ కర్మానీ వర్గానికి చెందిన చందు (చంద్రహాస్), ధర్మానీ వర్గానికి చెందిన బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. ఇద్దరి మధ్య పరిచయం మొదట గొడవలతో మొదలైనా ఆ తర్వాత ప్రేమ చిగురిస్తుంది.
గొడవలతో తామిద్దరం ఒక్కటి కాలేమని గ్రహించిన చందు, బుజ్జి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కేరళ వెళ్లిపోతారు. అయితే, సరిగ్గా తాళి కట్టే టైంకు బుజ్జి మనసు మారిపోతుంది. పెళ్లికి నిరాకరిస్తుంది. ఆమె అలా ఎందుకు చేసింది? చందు, బుజ్జిలు తిరిగి ఊరికి వెళ్లారా? ఊరిలో గొడవలు వీరి ప్రేమతో మరింత పెరిగాయా? గొడవలను దాటి వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















