తెలుగులో స్టార్ హీరోలు ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసే కల్చర్ తక్కువ. ఆ ట్రెండ్‌ స్టార్ట్ చేసిన హీరోల్లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకరు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందిన 'దూత' వెబ్ సిరీస్ (Dhootha Web Series)లో ఆయన నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్... అదేనండీ సీజన్ 2 చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

'దూత 2' నిర్మాతలు మారుతున్నారా?Dhootha Web Series Season 2 Producer: 'దూత' వెబ్ సిరీస్‌కు శరత్ మరార్ నిర్మాత. ఆయనకు చెందిన నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తోడు దర్శకుడు విక్రమ్ కె కుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు 'దూత' వెబ్ సిరీస్ సీజన్ 2కు వచ్చేసరికి నిర్మాతలు మారుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

Also ReadUrfi Javed: ఇస్లాం నుంచి నన్ను బహిష్కరించడానికి వాళ్ళెవరు? ఉర్ఫీ జావేద్ రియాక్షన్ విన్నారా?

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థపై 'దూత 2' వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయాలని నాగ చైతన్య భావిస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. ఎవరు ప్రొడ్యూస్ చేసినా చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనుకోండి. అయితే నిర్మాతలను ఎందుకు మారుస్తున్నారు? అనేది క్వశ్చన్. త్వరలో ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. 

Also Readఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్

ప్రస్తుతం చైతన్య చేస్తున్న సినిమాలు ఏమిటి?Naga Chaitanya Upcoming Movies: ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత 'బెదురులంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో అయన 25వ సినిమా చేయబోతున్నారు.

Also ReadKalpana Iyer Viral Video: 69 ఏళ్ల వయసులో 'రంభా హో' పాటకు డ్యాన్స్‌... కల్పనా అయ్యర్ వైరల్ వీడియో