Ooru Peru Bhairavakona Collections:యంగ్ హీరో సందీప్ కిషన్‌కు ఈ మధ్య సరైన హిట్ లేదు. గతేడాది పాన్ ఇండియా మూవీ మైఖేల్‌తో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస వద్ద బొల్తా కొట్టింది. ఈ మూవీ ప్లాప్ స్వయంగా సందీప్ కిషనే చెప్పాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'లో ఓ క్యారెక్టర్ చేస్తే... తెలుగులో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ తాజాగా 'ఊరు పేరు భైరవకోన' మూవీతో వచ్చాడు. నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటిటవ్ రివ్యూస్ తెచ్చుకుంది.
పెయిడ్ ప్రీమియర్స్‌కి డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు సందీప్ కిషన్ మూవీ ఊహించని కలెక్షన్స్ చేసింది. అతడి కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఒపెనింగ్ ఇచ్చిన మూవీగా 'ఊరు పేరు భైరవకోన' నిలిచింది. ఫస్ట్‌డే భారీ వసూళ్లు చేసి మేకర్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. తొలిరోజు వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ. 6.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. తాజాగా దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నైజాం ఏరియాలో కోటిన్నర వరకు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు నుంచి సమాచారం. చూస్తుంటే ఈ మూవీ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ చేసేలా ఉందంటున్నారు. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.
దాంతో సినిమాకు మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన రావడంతో వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. ఇక ఇండియాలో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.30 కోట్లు షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 3,5 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మూవీ ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.
మూవీ బిజినెస్ ఇలా
'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.
భైరవకోన అనే ఊరిలో అడుగుపెట్టిన వారు ఎవరూ ప్రాణాలతో తిరిగివచ్చింది లేదు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో బసవ (సందీప్ కిషన్) అతడి స్నేహితులు జాన్ (వైవా హర్ష), గీత (కావ్యథాపర్) భైరవకోనలో అడుగుపెడతారు. అక్కడ వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? బైరవ కోన నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? ప్రియురాలు భూమి (వర్ష బొల్లమ్మ) కోసం బసవ ఎందుకు దొంగతనం చేయాల్సివచ్చింది అన్నదే 'ఊరు పేరు భైరవకోన' కథ