యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌ డైలాగ్స్ రాశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో 'అమ్మ' సాంగ్ ను విడుదల చేశారు. 


ఇందులో శర్వానంద్ తల్లిగా అమలా అక్కినేని నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సాగే ఓ ఎమోషనల్ పాటను విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఈ పాటను ట్విట్టర్ లో షేర్ చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. 


జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 










Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?


Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..