Nuvvunte Naa Jathaga Serial Today Episode: దేవా చేసిన పనితో బాధపడుతూ కూర్చున్న మిధునకు తండ్రి ఓదారుస్తాడు. రిషిరూపంలో నీ జీవితంలో వెలుగు వచ్చిందంటూ ధైర్యం చెబుతాడు. ఇక నుంచి అన్నీ మంచే జరుగుతాయని అంటాడు. అర్థం చేసుకునే భర్త దొరకడం ఎంతో అదృష్టమని తల్లి కూడా ఆమెను ఓదారుస్తుంది. కాబోయే భార్యతో పరాయి మగాడు మాట్లాడితేనే సహించలేని కాలంలో కూడా....ఓ రౌడీ వెధవ నీ మెడలో బలవంతంగా మూడు ముళ్లు వేశాడని తెలిసినా రిషి దాన్ని పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆమెకు వివరిస్తారు. నీ మెడలో తాళికట్టినవాడు నిన్ను బలవంతంగా బయటకు నెట్టేశాడని...కానీ నీ మెడలో తాళి ఉన్నా రిషి పెళ్లికి సిద్ధమయ్యాడంటే....ఇంతకన్నా మంచి మగాడు దొరకడని చెబుతారు. రిషి నీకు అన్నివిధాల తగిన వాడని సర్థిచెబుతారు. ఒకప్పుడు నీ పెళ్లితో మన కుటుంబంలో తీవ్ర విషాధం నెలకొందని....ఇప్పుడు జరగబోయే పెళ్లితో సంతోషాలు రానున్నాయని అంటారు. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని వారు మిధునను అడగ్గా.....మీ ఇష్టమే నా ఇష్టమని చెబుతారు. పెళ్లయిన వెంటనే భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోవచ్చని...అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని భరోసా ఇస్తారు.

Continues below advertisement

మిధునను దూరం చేసుకున్న దేవా ఆమె గురించే తలచుకుని బాధపడుతుంటాడు. ఆ సమయంలోనే భాను పదేపదే దేవాకు ఫోన్‌ చేస్తుంటుంది. తాను బిజీగా ఉన్నానని చెప్పినా ఎందుకు విసిగిస్తున్నావంటూ భానుమతిపై దేవా మండిపడతాడు. నేను మీ ఇంటి ముందే ఉన్నానని...వెంటనే డోర్ తెరవాలని భాను చెబుతుంది. బయటకు వచ్చి ఎందుకు వచ్చావని నిలదీయగా....తాను సర్‌ప్రైజ్‌గా బర్త్‌డే విషెష్‌ చెప్పి కేక్ కట్‌ చేయిస్తుంది. అసలు విషయం చెబితే నువ్వు రావని...ఇలా ప్లాన్ చేశానని చెబుతుంది. భాను ఇంట్లో వాళ్లందరినీ బయటకు పిలిచి ..బర్త్‌డే సెలబ్రేటీ చేయిస్తుంది. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత జరిగే ఫస్ట్‌ బర్త్‌డే కాబట్టి సర్‌ఫ్రైజ్‌ చేశానని చెబుతుంది.తల్లిదండ్రులు చెప్పడంతో భాను తెచ్చిన కొత్త డ్రెస్‌ వేసుకుని వచ్చి దేవా కేక్ కట్‌ చేస్తాడు. సరిగ్గా అప్పుడే మిధునతో చేసుకున్న బర్త్‌డే సెలబ్రేషన్లు దేవాకు గుర్తుకు వస్తాయి.

అటు మిధున కూడా దేవాను తలచుకుంటూ శివపార్వతుల బొమ్మ గీస్తుంది. అప్పుడే అక్కడికి రిషి వచ్చి పెయింటింగ్‌ గురించి మెచ్చుకుంటాడు. భార్యాభర్తల బంధం గురించి శివపార్వతులను చూపి రిషికి చెబుతుంది మిధున. భార్యాభర్తల బంధంపై మిథునకు ఉన్న ఆలోచనలు చూసి రిషి ముగ్ధుడవుతాడు. తాను భార్యగా దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తాడు. అప్పుడే మిథునను తీసుకుని సిటీ టూర్‌కు వెళ్తానని ఆమె తండ్రిని అడుగుతాడు.మిథున అన్న,చెల్లితోపాటు తల్లిదండ్రులు అందూ ఓకే అంటారు. నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళితే కొంత రిలాక్స్‌గా ఉంటావని చెబుతారు.ఇంట్లో అందరూ ఓకే చెప్పడంతో వారిద్దరూ బయలుదేరతారు. ఇది చూసి త్రిపురకు ఒళ్లుమండిపడుతుంది. నా తమ్ముడిని చేసుకోవాల్సిన అమ్మాయి వేరొకరిని పెళ్లిచేసుకోబోతోందని....వారితో కలిసి బయటకు వెళ్లడం చూసి జల్సిగా ఫీలవుతుంది. ఆమెను భర్త రాహుల్‌ వారిస్తాడు. అయితే మిథునను తీసుకుని రిషి ఎక్కడికి వెళ్లిఉంటాడోనన్న ఉత్కంఠతో ఈ రోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

Continues below advertisement