ఇప్పుడు ప్రేక్షకుల చూపంతా 'ఆర్ఆర్ఆర్' మీద ఉంది. ఆల్రెడీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో రికార్డులు క్రియేట్ చేసిందీ సినిమా. బాక్సాఫీస్ బరిలో విజయ కేతనం ఎగుర వేసింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' జపాన్‌లో విడుదల అయ్యింది. ఈ సినిమా కంటే ముందు దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది కన్‌క్లూజన్' చిత్రాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో 'ఆర్ఆర్ఆర్'కు ఎటువంటి స్పందన లభిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. 


'ఆర్ఆర్ఆర్' జపాన్ రిలీజ్ సందర్భంగా... అక్కడికి కొమరం భీం పాత్రలో మనల్ని మెస్మరైజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జపనీస్‌లో (NTR Japanese Speech) మాట్లాడి ప్రేక్షకులు అందర్నీ ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశారు.
 
తప్పులు ఉంటే క్షమించండి! 
RRR Japan Release : ''నేను జపనీస్‌లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకవేళ నా వైపు నుంచి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి'' అంటూ జపాన్ స్పీచ్ స్టార్ట్ చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... భాష తెలియకపోయినా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడుతుంటే భలే ముద్దు ముద్దుగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు సైతం ఆయన డెడికేషన్‌కు ఫిదా అయిపోయారు. అక్కడి ప్రేక్షకుల సంగతి చెప్పనవసరం లేదు. ఆయన జపనీస్ స్పీచ్ స్టార్ట్ కాగానే సంతోషపడిపోయారు. కేరింతలతో ఆయన్ను ఎంకరేజ్ చేశారు. 


సతీ సమేతంగా...
ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli)... ముగ్గురూ సతీ సమేతంగా జపాన్ వెళ్లారు.  జపాన్‌లో ప్రీమియర్ షో వీక్షించారు. ఈ సందర్భంగా ప్రణతి (NTR Wife Pranathi), ఉపాసన (Upasana Kamineni), రామ (Rama Rajamouli )... ముగ్గురూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదీ సంగతి!


Also Read : బాలకృష్ణ సినిమా చూసి రోజంతా జైల్లో ఉన్న దర్శకుడు


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన 'ఆర్ఆర్ఆర్'లో ఒలీవియా మోరిస్ , ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. 


'ఆర్ఆర్ఆర్'కు హాలీవుడ్ సినిమా ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల స్పందన కోసం సినిమా యూనిట్, ఇతరులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... ఆస్కార్ రేసులో పోటీ పడుతున్న సినిమా కదా!


'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేష్ బాబుతో!
'ఆర్ఆర్ఆర్' జపాన్ టూర్ ముగిసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేయబోయే సినిమా స్క్రిప్ట్ మీద రాజమౌళి డిస్కస్ చేయనున్నారు. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఎటువంటి సినిమా చేయాలనేది కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు సీన్స్, మిగతా విషయాలు ఫైనలైజ్ కావాల్సి ఉంది.