యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. దీంతో 'ఆర్ఆర్ఆర్' టీమ్ పార్టీలు చేసుకుంటుంది. అలానే ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.


 రామ్ చరణ్ తన ప్రతి పుట్టినరోజు ఎన్టీఆర్ తో కలిసి చేసుకుంటానని ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలానే జరుపుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయింది. దీనికి సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అలానే రామ్ చరణ్ కి స్పెషల్ గా విషెస్ చెబుతూ ట్విట్టర్ లో ఓ ఫొటో షేర్ చేశారు. 


ఇందులో రామ్ చరణ్ షర్ట్ కి బటన్స్ పెడుతూ కనిపించారు ఎన్టీఆర్. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ సమయంలో తీసిన పిక్ అది. ఇద్దరూ తమ క్యారెక్టర్స్ కి చెందిన కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బ్రదర్, నువ్ ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటున్నందుకు కృతజ్ఞతలు.. అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలంటూ కోరుకుంటున్నారు. 


Also Read: 'ది కశ్మీర్ ఫైల్స్' నా సినిమాను దెబ్బకొట్టింది - అక్షయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్


Also Read: 'నన్ను గర్వపడేలా చేశాడు' చిరంజీవి ఎమోషనల్ పోస్ట్