నయనతార (Nayanthara)... లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామ. ఇప్పుడు ఆమెను కథానాయికగా కంటే సినిమాను భుజాల మీద మోయగల సత్తా ఉన్న నటిగా తమిళ చిత్రసీమ చూస్తోంది. అందువల్ల, ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు నయనతార ఫస్ట్ ఛాయస్‌గా మారారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా మహిళా ప్రాధాన్య సినిమా 'కనెక్ట్' (Connect Movie).


తెలుగు, తమిళ భాషల్లో గురువారం 'కనెక్ట్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ రోజు కంటే ముందు సినిమాను కొంత మందికి చూపించారు. తమిళనాడులో ప్రీమియర్ షో వేశారు. తెలుగు మీడియా ప్రతినిధులకు మంగళవారం చూపిస్తున్నారు. మరి, తమిళ ప్రేక్షకులు సినిమా చూసి ఏమన్నారంటే...
 
హారర్ ఎక్స్‌లెంట్!
'కనెక్ట్' సినిమా సూపర్ ఉందని చెన్నైలో ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్వీట్లు చేశారు. విజువల్స్, సౌండ్ డిజైన్ ఎక్స్‌లెంట్ అంటున్నారు. అయితే... కథ విషయంలో మాత్రం నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. చిన్న పాయింట్ పట్టుకుని దర్శకుడు అశ్విన్ శరవణన్ సినిమా తీశారని బావుందని చెబుతున్న ప్రేక్షకులు సైతం ట్వీట్లు చేయడం గమనార్హం. థియేటర్లలో సినిమా చూడాలని అందరూ చెబుతున్నారు. 


ఐదారుసార్లు భయపడతారు!
'కనెక్ట్' సినిమా చూసేటప్పుడు కనీసం ఐదారు సార్లు భయపడతారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. తమిళ మీడియా వ్యక్తి ఒకరు అయితే దర్శకుడు అశ్విన్ శరవణన్‌కు ఆస్కార్ ఇవ్వాలంటూ ట్వీట్ చేయడం విశేషం. అందరూ బావుందని చెప్పారా? ఒక్కరు అంటే కనీసం ఒక్కరు కూడా బాలేదని చెప్పలేదా? అంటే... అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సంఖ్య తక్కువగా ఉంది. 


'కనెక్ట్' కంటే 'మాయ', 'గేమ్ ఓవర్' బావున్నాయ్!
నయనతార, దర్శకుడు అశ్విన్ శరవణన్ కలయికలో 'కనెక్ట్' రెండో సినిమా. దీని కంటే ముందు ఆమెతో 'మాయ' తీశారు. ఆ తర్వాత తాప్సీ పన్నుతో 'గేమ్ ఓవర్' చేశారు. ఇప్పుడు వచ్చిన 'కనెక్ట్' కంటే ఆ రెండు సినిమాలు బెటర్ అని ఒకరు ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడి భార్య కావ్యా కళ్యాణ్ రామ్ కథ అందించారు. ఇదొక హారర్ థ్రిల్లర్. పాండమిక్ పీరియడ్ (కరోనా కాలం) నేపథ్యంలో కథ సాగుతుంది.


Also Read : హీరోపై చెప్పుతో దాడి - పునీత్ రాజ్‌కుమార్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా?






















































'కనెక్ట్' కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో సుమ కనకాల (Suma Kanakala), తమిళంలో దీదీ నీలకంఠన్ (దివ్యదర్శని) ఇంటర్వ్యూ చేశారు. త్వరలో ఇది విడుదల కానుంది. సాధారణంగా నయనతార ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన 'అనామిక' విడుదలైనప్పుడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడీ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ  సినిమాను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. భర్త కోసం నయనతార ఇంటర్వ్యూ ఇచ్చారేమో!?


అనుపమ్ ఖేర్... సత్యరాజ్!
'కనెక్ట్' సినిమాలో సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన 'కార్తికేయ 2'లో అనుపమ్ కనిపించారు. తమిళంలో ఆయన ఇంతకు ముందు ఓ సినిమా చేశారు. అయితే, పదిహేనేళ్ల తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా 'కనెక్ట్' కావడం విశేషం. 'వాన' హీరో వినయ్ రాయ్, చైల్డ్ యాక్టర్ హనియా నఫీసా కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా... మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరించారు.