ఒకప్పుడు హైదరాబాద్‌లోని ఫేమస్ థియేటర్లలో ‘తారక రామ’ కూడా ఒకటి. అయితే కాలక్రమంలో ఆ థియేటర్ మూతపడింది. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె.దాస్  10 సంవత్సరాల క్రితం కాచిగూడలోని తారకరామ థియేటర్‌ని పునరుద్ధరించారు. ఎన్టీఆర్, నారాయణ్ కె.దాస్ నారంగ్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు.


ఆసియన్ తారకరామ సినిమా హాల్‌ను నారాయణ్ కె.దాస్ నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ పునరుద్ధరించారు. ఈ థియేటర్‌లో ఇప్పుడు పూర్తిగా కొత్త టెక్నాలజీ అయిన 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండింగ్, సీటింగ్ ఉన్నాయి. 975 సీట్ల కెపాసిటీ ఉన్న హాల్‌ని 590 సీట్లకు తగ్గించి సినిమా చూసే అనుభూతిని మెరుగుపరచనున్నారు. హాల్‌లో పూర్తి రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంటీరియర్ వర్క్ కూడా అద్బుతంగా ఉండనుంది.


నందమూరి బాలకృష్ణ ఏషియన్ తారకరామను రీ-ఓపెన్ చేయనున్నారు. డిసెంబరు 14వ తేదీ మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ థియేటర్ తిరిగి ప్రారంభం కానుంది. ఏషియన్ సినిమాలకు లక్కీ చార్మ్ గా నిలిచిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శిరీష్ ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. తమకు సహకరించిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, సురేష్ బాబు, సదానంద్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.