తెలుగు తెర మన్మథుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఊపిరి చిత్రంలో వాళ్ళిద్దరూ నటించారు. అప్పటి నుంచి నాగార్జునను 'అన్నయ్య' అని కార్తీక్ ఆప్యాయంగా పిలుస్తుంటే... అతడిని తమ్ముడిలా నాగార్జున చూస్తారు. కథానాయకుడిగా కార్తీ సాధించిన ఘనతను చెబుతూ... అతడిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నాగార్జున పోల్చారు.
కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సర్దార్'. ఇందులో రాశీ ఖన్నా కథానాయక. దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకు సినిమా వస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ సిటీలో తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ పార్టీ మధ్య ఉన్న ఒక కామన్ థింగ్ ను నాగార్జున బయట పెట్టారు.
తెలుగులో పవన్ కళ్యాణ్...
కన్నడలో పునీత్ రాజ్ కుమార్...
తమిళంలో కార్తీ!
''కార్తీ అన్నయ్య సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుంచి బయటకు వచ్చి ప్రతిభను నిరూపించుకోవడం సామాన్యమైన విషయం కాదు... తమ టాలెంట్ నిరూపించుకోవడం చాలా అరుదు. అటువంటి వాళ్లను ఇద్దరిని నేను చూశాను. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్. కన్నడలో శివన్న (కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పెద్ద కుమారుడు శివ రాజ్ కుమార్) తమ్ముడు పునీత్. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ. అతడు స్టార్ హీరోగా ఎదగడం మామూలు విషయం కాదు. చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంతటి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు'' అని కార్తీ గురించి నాగార్జున మాట్లాడారు.
కార్తీ గురించి చెప్పే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నేడు నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అగ్ర కథానాయకుడిగా ఎదిగారని నాగార్జున అన్నారు. ఆయన మాటలు పవర్ స్టార్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ పేరు వేడి పుట్టిస్తోంది. ఈ తరుణంలో సినిమా వేడుకలోనూ పవన్ పేరు వినిపించడం విశేషం.
'సర్దార్' సినిమా విషయానికి వస్తే... విశాల్ 'అభిమన్యుడు'కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు అని నాగార్జున అన్నారు. కార్తీ తెలుగులో మాట్లాడమే కాదని, పాటలు కూడా పాడతాడని.. . తెలుగు మాట్లాడే వాళ్ళను తెలుగు ప్రేక్షకులు అసలు వదలరని ఆయన అన్నారు.
Also Read : 'బిగ్ బాస్'లో దర్శకుడిపై పోలీస్ కేసు - షో నుంచి తీసేయండి సార్
'సర్దార్' గురించి కార్తీ మాట్లాడుతూ ''నా కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్. నేను తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యా. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వుంటుంది. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళి కి ఖైధీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది'' అని అన్నారు.