Rangabali Teaser: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకున్న నాగశౌర్యకు గత కొంత కాలంగా సరైన హిట్ సినిమా పడలేదు. ఈ ఏడాది ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగశౌర్య. ఈ సినిమా కూడా ఆశించినంత ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘రంగబలి’ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ఈ యువ హీరో. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కు కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. దీంతో నాగశౌర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సొంతూరు కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ‘రంగబలి’..
ముందుగా అనౌన్స్ చేసినట్టే ‘రంగబలి’ టీజర్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కామెడీ ఎంటర్టైనర్ గా మూవీను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇది ఊర్లలో చాలా మంది కుర్రాళ్ల కథలానే అనిపింస్తుంది. సినిమాలో హీరో(నాగశౌర్య) తన తండ్రి మెడికల్ షాప్ లో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్ తో తిరగడం, గొడవలు కనిపిస్తాయి. తర్వాత హీరోయిన్ తో పరిచయం ఆమెను ఇంప్రెస్ చేయడానికి హీరో పడేపాట్లు అలా టీజర్ లో చూపించారు. చూడటానికి మూవీ ఓల్డ్ సబ్జెక్ట్ లానే కనిపిస్తున్నా టీజర్ ను కలర్ ఫుల్ గానే కట్ చేశారు మేకర్స్. అలాగే ఇది సొంతూరును లీడ్ గా తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి యూత్ ను ఆకట్టుకోవచ్చు. అలాగే సినిమా దర్శకుడు గోదావరి కుర్రోడు కావడంతో ఆ ప్రాంతంలో ఉండే యాస, మాండలికాల ప్రభావం బాగానే కనిపిస్తుంది. అయితే టీజర్ కథ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. బహుశా ట్రైలర్ లో చూపిస్తారేమో. మొత్తానికి నాగశౌర్యకు సరిగ్గా సరిపడే కథనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
లేటైనా లేటెస్ట్ గానే..
వాస్తవానికి ఈ సినిమాను గతేడాదే అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైందో తెలీదుకానీ దాదాపు ఏడాది పాటు ఎలాంటి అప్డేట్ లు ఇవ్వలేదు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో మూవీ పై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాతో అయినా నాగశౌర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ మూవీలో షైన్ టామ్ చాకో, సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, బ్రహ్మాస్త్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘దసరా’ లాంటి హిట్ సినిమాలను నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అలాగే అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.