బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో ఘాట్ ఆ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసింది. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ ఆ ఫోటోస్ దిగారు. అయితే ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ గతంలో పోలీసు కేసు కూడా నమోదైంది. తాజాగా ముంబయి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో రణవీర్ ఇంట్లో లేనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విచారణ కోసం ఆగస్టు 22న పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 


అసభ్యకరమైన రీతిలో, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఆ ఫొటోలు ఉన్నాయంటూ ముంబయికి చెందిన ఓ సామాజికవేత్త, మహిళా న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌పై మహిళా న్యాయవాది నుంచి తమకు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని పోలీసులు ధ్రువీకరించారు. దీనిపై ప్రాథమిక  విచారణ మొదలు పెట్టినట్టు తెలిపారు. ఇంతకు ముందు రణవీర్ పై చెంబూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఓ ఎన్జీవో ఫిర్యాదు చేశారు.


రణవీర్ చేసిన ఈ న్యూడ్ ఫోటోషూట్ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. దీనిపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. "అందులో తప్పేముంది? ఒక పురుషుడు న్యూడ్‌గా ఫస్ట్ టైం ఫోటోస్ దిగాడు. అవి చూసి ఎంజాయ్ చేయనివ్వండి. కొంతమందికి (పోలీసు కేసు పెట్టిన వాళ్ళు) ఆ ఫోటోస్ నచ్చకపోతే చూడటం మానెయ్యాలి. వాళ్ళకి ఏం పని లేదనుకుంటా. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేసి వాళ్ళ టైం వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చకపోతే ఫోటోస్ చూడకుండా పేపర్ పక్కన పడెయ్యాలి’’ అని అన్నారు. పేపర్ మ్యాగజైన్ కోసం ర‌ణ్‌వీర్ సింగ్‌ న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ చేశారు. ర‌ణ్‌వీర్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌కు ఈ ఫోటో ఘాట్ తెగ నచ్చేసిందట. 


ర‌ణ్‌వీర్ ట్రెండ్‌ను పలువురు ఫాలో కూడా అయ్యారు. విష్ణు విశాల్, టాలీవుడ్ నటుడు నందు కూడా ర‌ణ్‌వీర్ ట్రెండ్ అంటూ అర్థనగ్న ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Also Read: రచ్చ రచ్చ చేసిన అభిమానులు - మాల్ నుంచి నిమిషాల్లోనే వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ


Also Read: పండుగాడు కొడితే దిమ్మతిరిగి బాక్సాఫీసు బద్దలైంది - 'పోకిరి' స్పెషల్ షోస్‌కు అదిరిపోయే కలెక్షన్స్